Kalki 2898AD : ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన నాగ్ అశ్విన్.. 'కల్కి'లో ఈ ఐదుగురి గెస్ట్ రోల్స్ అస్సలు ఊహించలేదే!

'కల్కి 28989AD' సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ తో పాటూ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషించారు. వీళ్ళతో పాటూ మృణాళ్‌ ఠాకూర్‌, రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, కె.వి. అనుదీప్‌, ఫరియా అబ్దుల్లా సైతం కనిపించారు.

New Update
Kalki 2898 AD: రికార్డులు బద్ధలే..ప్రపంచ వ్యాప్తంగా కల్కి మూవీ ఫీవర్

Prabhas Kalki Movie Guest Roles :  ప్రభాస్ (Prabhas) - నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కిన 'కల్కి 28989AD' (Kalki 2898AD) మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ తో రిలీజ్ చేసిన 'కల్కి' థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తోంది. సినిమా మొదటి ఆట పూర్తి అయిపొయింది. ప్రేక్షకులు థియేటర్ల దగ్గర హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సంబరాలు స్టార్ట్ చేశారు. ఇక సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటించిన విషయం తెలిసిందే.

ప్రభాస్ తో పాటూ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన కీలక పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ కూడా ఉన్నారని నిన్న నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. అయితే వీళ్ళతో పాటూ మరో ఐదు మంది స్టార్స్ ఇందులో తళుక్కున మెరిశారు. ఆ ఐదుగురిని బిగ్ స్క్రీన్ పై చూసిన ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు.

Also Read : ‘కల్కి’ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!

ఇంతకీ ఆ ఐదుగురు మరెవరో కాదు మృణాళ్‌ ఠాకూర్‌, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, కె.వి. అనుదీప్‌, ఫరియా అబ్దుల్లా.. వీళ్లంతా 'కల్కి' లో కనిపించారు. వీరందరూ కూడా గెస్ట్‌ రోల్స్‌ కనిపించినా.. ఏదో హైప్ కోసం అని పెట్టకుండా నాగ్ అశ్విన్ కథకు తగ్గట్లు వీరి క్యామియోస్ ను డిజైన్ చేయడం విశేషమనే చెప్పాలి. ఈ క్రమంలోనే కల్కి కాస్ట్ సెలెక్షన్ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ఆడియన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు