Kalki 2898 AD : 'కల్కి' ప్రమోషన్స్ కి భారీ ఏర్పాట్లు.. వచ్చే నెల నుంచి వరుస సర్ప్రైజ్ లు, ఫ్యాన్స్ కి పండగే!

జూన్ 4 తర్వాత 'కల్కి' నుంచి వరుస అప్డేట్స్ తో పాటూ దేశ వ్యాప్తంగా ఎన్నో ఈవెంట్స్ ప్లాన్ చేశారట. దీపికా పదుకొనె, దిశా పటానిల ఇంట్రో వీడియోలను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని పాత్రలను సైతం పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

New Update
Kalki 2898 AD : 'కల్కి' ప్రమోషన్స్ కి భారీ ఏర్పాట్లు.. వచ్చే నెల నుంచి వరుస సర్ప్రైజ్ లు, ఫ్యాన్స్ కి పండగే!

Prabhas Kalki 2898 AD Promotions : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కల్కి 2898AD' వచ్చే నెల 27 న విడుదల కానుంది. అంటే సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే మిగిలుంది. పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఈ టైం చాలా తక్కువ. అందుకే ఈ తక్కువ సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలని మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

జూన్ 4 తర్వాత ఎన్నో సర్ప్రైజ్ లు

ఈ క్రమంలోనే కల్కి నుంచి ఈ నెల రోజుల్లో ఎన్నో సర్ప్రైజ్ లు ఇవ్వబోతున్నారట. సరిగ్గా ఎలక్షన్స్ రిజల్ట్ జూన్ 4 తర్వాత కల్కి ప్రమోషన్ స్టార్ట్ కానుంది. వరుస అప్డేట్స్ తో పాటూ దేశ వ్యాప్తంగా ఎన్నో ఈవెంట్స్ ప్లాన్ చేశారట మేకర్స్. సినిమా నుంచి బుజ్జి, భైరవ గ్లింప్స్ ని రిలీజ్ చేసినట్లు దీపికా పదుకొనె, దిశా పటానిల ఇంట్రో వీడియోలను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట.

Also Read : పాపం.. డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ ఆనీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో!

అలాగే వీరితో పాటూ సినిమాలో క్యామియో రోల్స్ చేస్తున్న దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని ల పాత్రలను ఈ ప్రమోషన్స్ లోనే పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు కమల్ హాసన్ ని సైతం ప్రమోషన్స్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. అంటే వచ్చే నెల మొత్తం ఇండియాలో కల్కి ఫీవర్ నడవబోతుందన్నమాట. ఫ్యాన్స్ కి మాత్రం పండగే అని చెప్పొచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మరోసారి వింటేజ్ కాంబో.. బాలయ్య సినిమాలో విజయశాంతి

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ 2 లో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్. బ్లాక్ బస్టర్ 'అఖండ' సీక్వెల్ గా 'అఖండ 2' తెరకెక్కుతోంది.

New Update

Akhanda 2 Update:   రాజకీయాలతో కొంతకాలం సినిమాలకు దూరమైనా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇటీవలే  'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాతో అలరించిన విజయశాంతి.. ఇంతలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అఖండ 2 లో విజయశాంతి 

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ 2 లో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 

ఇదిలా ఉంటే  'అఖండ 2:  తాండవం'  చిత్రీకరణ  ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే  సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ,  VFX పనులు ఆలస్యమవుతుండడంతో వచ్చే ఏడాది  2026  సంక్రాంతికి  వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ  అయితే  విషయంపై ఇంకా అధికారిక ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

telugu-news | cinema-news | latest-news | vijayashanthi

Advertisment
Advertisment
Advertisment