Prabhas:ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా - ప్రభాస్ పోస్ట్ వైరల్!!

.Prabhas: సలార్ హిట్ జోష్తో ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

New Update
Prabhas:ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా - ప్రభాస్ పోస్ట్ వైరల్!!

Prabhas Insta Post : పాన్ ఇండియా స్టార్ (Prabhas) ప్రభాస్ సలార్ హిట్ జోష్ లో ఉన్నారు. అయితే తగినంత పబ్లిసిటీ ;లేక హిట్ శాతం కాస్త తగ్గిందని విమర్శలు వినిపిస్తున్నా కలక్షన్ల పరంగా మాత్రం స్టామినా చాటుకుంటోంది. సాధారణంగా ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.కానీ .సలార్ మూవీకి భారీ విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేయడంతో పాటు సలార్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డార్లింగ్ ప్రభాస్ . ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ స్పందిస్తూ సలార్ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.

నేను ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా

సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించడం మా టీమ్ కు మీరిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తామని ప్రభాస్ తెలిపారు. సలార్ మూవీకి ఇంత గొప్ప అవుట్ పుట్ఈ రావడం వెనుక ప్రాజెక్టుకు పని చేసిన ప్రతీ ఒక్కరి శ్రమ ఉందని ప్రభాస్ కామెంట్లు చేశారు. ప్రేక్షకులు సలార్ ను ప్రశంసిస్తుంటే మా అందరికీ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని ప్రభాస్ చెప్పుకొచ్చారు. నేను ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తానని మీరంతా కొత్త సంవత్సరం వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సలార్ ను ఆదరించినందుకు ధన్యవాదాలు అని ఆయన కామెంట్లు చేశారు.

సలార్ 2 రిలీజ్ అయ్యేది అప్పుడే

ప్రభాస్ (Prabhas) న్యూ ఇయర్ విషెస్ తో ఈ పోస్ట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.సలార్2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా 2025 సంవత్సరంలో విడుదల చేసందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు సలార్ శౌర్యాంగ పర్వం మూవీ వేరే లెవెల్ లో ఉండబోతుందని సలార్ మొదటి భాగం చూస్తే యిట్టె అర్ధం అవుతోంది/

యానిమల్ మూవీ కలెక్షన్లను సలార్ క్రాస్ చేస్తుందా ?

సలార్1 మూవీ ఇప్పటికే 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఫుల్ రన్ లో ఈ సినిమా 800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. యానిమల్ మూవీ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ALSO READ:Guntur Kaaram : గుంటూరు కారం వివాదాల ఘాటు.. మరి.. బాక్స్ ఆఫీస్ లో తన ఘాటు చూపిస్తుందా?

#salar #instagram #salar-2-reease-date #darling-prabhas
Advertisment
Advertisment
తాజా కథనాలు