Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాలీవుడ్ యాక్షన్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్..? అజయ్ దేవగణ్ 'సింగమ్ అగైన్' లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాలో అతిథిపాత్ర చేయనున్న హీరోను ఉద్దేశిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. అందులో‘కల్కి’లోని బుజ్జి థీమ్ సాంగ్‌ను ఉపయోగించారు. దీంతో అది ప్రభాస్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. By Anil Kumar 03 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Prabhas : మన టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్ 2' తో బీ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తాజాగా మరో హీరో మాత్రం బాలీవుడ్ యాక్షన్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అతను మరెవరో కాదు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్, కల్కి వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న డార్లింగ్.. అజయ్ దేవగణ్ 'సింగమ్ అగైన్' లో కనిపించనున్నాడు. డైరెక్టర్ రోహిత్ శెట్టి స్వయంగా దీనిపై ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఈ డైరెక్టర్.. సినిమాలో అతిథిపాత్ర చేయనున్న హీరోను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘ఈ హీరో లేకపోతే ఈ చిత్రం అసంపూర్తిగా ఉంటుంది. దీపావళికి ఈ స్కార్పియోలోని నటుడు సందడి చేయనున్నాడు. Also Read : 2029లో సీఎం, 2034లో పీఎం.. రాసి పెట్టుకోండి.. పవన్ కళ్యాణ్ పై జానీ మాస్టర్ కామెంట్స్ కానీ, ఇక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది’ అని ఆ నటుడు ఎవరో చెప్పకుండా కేవలం స్కార్పియో వస్తోన్న వీడియోను మాత్రమే పోస్ట్ చేశారు. అయితే దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ‘కల్కి’లోని బుజ్జి థీమ్ సాంగ్‌ను ఉపయోగించారు. దీంతో ఆ కారులో ఉన్నది ప్రభాస్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే 'సింగమ్ అగైన్' మూవీకి టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ దక్కే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by Rohit Shetty (@itsrohitshetty) #prabhas #singham-again సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి