/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Post-Office-Insurance-jpg.webp)
Post Office Insurance: మన దేశంలో ఇన్సూరెన్స్ పై అవగాహన తక్కువ. ఎవరో వచ్చి చెబితేనే.. లేదా ఎవరో బలవంత పెడితేనే తప్ప ఇన్సూరెన్స్ చేయించుకోవడం జరగదు. ఒకవేళ అనుకోని ఉపద్రవం వచ్చి పడితే పరిస్థితి ఏమిటి అని ఎక్కువ శాతం అసలు ఆలోచించరు. ఎవరైనా అన్నీ ఆలోచించి ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకున్నా.. ఇన్సూరెన్స్ ప్రీమియంలు వారిని అందుకు ముందుకు వెళ్లేలా చేయవు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు చాలా ఎక్కువ ధర ఉంటాయి. ఈ కారణంగా కూడా చాలా మంది ఇన్సూరెన్స్ అంటేనే దూరంగా ఉంటారు. చాలామందికి ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోవడం ఇందుకు కారణం. అయితే, ప్రమాదాలు చెప్పిరావు కదా. ఎప్పుడైనా అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ ప్రమాదంలో మనిషి ప్రాణం పోతే.. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి? ఇన్సూరెన్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని పోస్టాఫీస్ ఒక పథకం తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరితోనూ ఇన్సూరెన్స్ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిసి తపాలా శాఖ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్ ఇచ్చే ఇన్సూరెన్స్(Post Office Insurance) అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఇన్సూరెన్స్(Post Office Insurance) కోసం కేవలం 755 రూపాయలు చెల్లిస్తే చాలు . ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే 15 లక్షల రూపాయలు నామినీకి అందిస్తారు. అదే శాశ్వత వైకల్యం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే వారికి కూడా 15 లక్షల రూపాయలు అందచేస్తారు. ప్రమాదం జరిగినపుడు వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యం కోసం రోజుకు 1000 రూపాయలు, ఐసీయూలో ఉంటె రెండు వేళా రూపాయలు ఇస్తారు. చేయి లేదా కాలు విరిగితే కనుక 25 వేల రూపాయలు ఇస్తారు. పాలసీదారు చనిపోతే పిల్లల చదువుల కోసం లక్ష, పెళ్ళికి లక్ష ఈ ఇన్సూరెన్స్ చేయించుకున్న వారి నామినీకి అందుతాయి.
Also Read: అందరికీ ప్రధాని మోదీ అదిరిపోయే న్యూఇయర్ గిఫ్ట్..పెట్రోల్ రేట్ల భారీ తగ్గింపు!
ఇదే కాదు.. టాటా ఏఐజీతో కలిసి మరో ఇన్సూరెన్స్(Post Office Insurance) పాలసీ కూడా పోస్టాఫీస్ ఇస్తోంది. దీనికి వార్షిక ప్రీమియం 520 రూపాయలు. 10 లక్షల రూపాయల బీమా కవర్ ఉంటుంది. అంటే ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు, శాశ్వత వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే 10 లక్షలు అందజేస్తారు. ఇందులో కూడా పాలసీ హోల్డర్ చనిపోతే పిల్లల విద్య కోసం లక్ష రూపాయాలు అందిస్తారు. అలాగే 320 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 5 లక్షల కవర్ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ కూడా టాటాఏఐజీ పోస్టాఫీస్ కలిసి అందిస్తున్నాయి. ఈ పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి 5 లక్షల రూపాయలు, శాశ్వత వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే 5 లక్షలు అందుతాయి. వైద్య ఖర్చుల కోసం 50 వేళా వరకూ ఇస్తారు.
పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే అర్హతలు ఇవే..
18-65 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పాలసీ(Post Office Insurance) తీసుకోవచ్చు. దీనికోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో ఎకౌంట్ ఓపెన్ చేయాలి. కేవలం 100 రూపాయలతో ఈ ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఏ పోస్టాఫీస్ లో అయినా ఈ ఎకౌంట్ తెరవవచ్చు. దీని ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.
Watch this interesting Video: