Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? ఎంత ఖర్చవుతుందో తెలుసా? జమిలి ఎన్నికల నిర్వహణ ఎంతమేరకు సాధ్యం అన్న చర్చ మళ్లీ మొదలైంది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమా కాదా అంటూ... కేంద్ర న్యాయశాఖ, ఈసీకి పలు ప్రశ్నలు పంపింది. జమిలి ఎన్నికల ఖర్చు, సాధ్యాసాధ్యాలపై మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 21 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి One Nation One Elections: దేశమంతా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాల్ని కూడా కోరింది మోదీ సర్కార్. దీంతో జమిలి ఎన్నికలకు వెళ్తే... ఎంత ఖర్చవుతుందో ఎన్నికల సంఘం తేల్చింది. జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే... ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలు కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సీఈసీ. అందుకు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఓటింగ్ యంత్రాలు గరిష్టంగా 15 ఏళ్లు పనిచేస్తాయి: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమా కాదా అంటూ... కేంద్ర న్యాయశాఖ, ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు పంపింది. దానికి ఈసీ ఇటీవల సమాధానం ఇచ్చింది. అందులో పలు కీలక అంశాల్ని స్పష్టంగా తెలిపింది ఈసీ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు గరిష్టంగా 15 ఏళ్లు పనిచేస్తాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను మూడు సార్లు మాత్రమే ఉపయోగించుకోగలం. ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు సెట్లు ఈవీఎంలు కావాలి. ఒకటి లోక్‌సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీకి అవసరం. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తే... కొత్తవాటిని భర్తీ చేయడానికి కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లలు, వీవీ ప్యాట్ మెషీన్లు అదనంగా రిజర్వ్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది. కనీసం ఒక ఈవీఎంకి ఒక బీయూ, సీయూ, వీవీ ప్యాట్ అవసరం. ఈవీఎంలకే భారీ ఖర్చు: జమిలి ఎన్నికలకు కనిష్టంగా 46 లక్షలా 75 వేలా 100 బ్యాలెట్ యూనిట్లు, 33 లక్షలా 62వేలా 600 వీవీప్యాట్ యంత్రాలు కావాలి. 2023 ప్రారంభం నాటి ఈవీఎం ధరను పరిశీలిస్తే... ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర ఏడు వేలా 900 రూపాయలు ఉంది. ఇక కంట్రోల్ యూనిట్ ధర 9వేలా 800, వీవీ ప్యాట్ ధర 16వేలు ఉంది. ఈ లెక్కన జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలని కొనాలి. అంటే ప్రతిసారీ 10 వేల కోట్ల రూపాయలు ఒక్క ఈవీఎంలకే ఖర్చు అవుతుందని ఈసీ తెలిపింది. ఐదు అధికరణలను సవరించాలి: ఇక ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఈవీఎం స్టోరేజ్ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరం అవుతాయని ఈసీ పేర్కొంది. కొత్త యంత్రాల తయారీ, రవాణా ఇతర అంశాలు కూడా లెక్కలోకి తీసుకుంటే 2029 నుంచి జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడింది ఈసీ. అంతేకాకుండా జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించాల్సిన అవసరముందని కూడా తెలిపారు ఈసీ అధికారులు. ఇప్పటికే ఒకే దేశం - ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ ఇటీవలే ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించింది. అయితే ఈసీ వివరణతో జమిలి ఎన్నికల నిర్వహణ ఎంతమేరకు సాధ్యం అన్న చర్చ మళ్లీ మొదలైంది. Also Read: కేసీఆర్ మద్యానికి బానిసలను చేసిండు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయాల్సిందిదే! WATCH: #jamili-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి