Hyderabad: గాంధీ , నిమ్స్‌ లో కుళ్లిన ఆహారం...!

GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్​లో భాగంగా గాంధీ, నిమ్స్ ఆసుపత్రిల్లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన కందిపప్పు, దుర్వాసన వస్తున్న పిండితో ఇడ్లీలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

New Update
Hyderabad: గాంధీ , నిమ్స్‌ లో కుళ్లిన ఆహారం...!

Hyderabad: పేదలకు కొండంత అండగా ఉండే గాంధీ, నిమ్స్‌ ఆసుపత్రుల్లో పేషెంట్లు , వాళ్ల అటెండెంట్లకు ఏమాత్రం క్వాలిటీ లేని ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ విషయం ఫుడ్​సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. గడిచిన మూడు రోజుల్లో హైదరాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు సుమారు 20 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేశారు.

స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్​లో భాగంగా ఈ నెల 20న (మంగళవారం) గాంధీ, నిమ్స్ ఆసుపత్రిల్లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన కందిపప్పును వండుతుండడంతో పాటు దుర్వాసన వస్తున్న పిండితో ఇడ్లీలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

నిమ్స్ లోనూ ఇలాంటి పరిస్థితినే అధికారులు గుర్తించారు. పేషెంట్లతో పాటు అటెండెండ్లకు హైజెనిక్​ ఫుడ్​ ఇవ్వాల్సిన ఈ రెండు ఆస్పత్రుల క్యాంటిన్లలోనూ అధ్వాన పరిస్థితులు ఉన్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన శాంపిల్స్​ను ల్యాబ్​కు పంపించారు. రిపోర్టులు రాగానే ఒకటి, రెండు రోజుల్లో ఆ రెండు ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, కొన్ని హాస్పిటల్స్ ప్రమాణాలు పాటిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకే ఈ తనిఖీలు జరుపుతున్నట్టు ఆఫీసర్లు వివరించారు.

Also Read: కనిపించని కత్తెర… ఆగిపోయిన 36 విమానాలు .. ఆలస్యమైన 200 సర్వీసులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు