AP News: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి!

ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం పోలీసులతో వ్యవహరిస్తోందని అన్నారు.

New Update
AP News: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి!

Ponnavolu Sudhakar: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామరాజు అరెస్ట్ సమయంలో చట్ట ప్రకారమే నడుచుకున్నామని, కస్టడీలో తనను కొట్టారని మూడేళ్ల తర్వాత రఘురామరాజు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. జగన్ సహా ఇతర ప్రభుత్వ అధికారులపై దుర్మార్గంగా హత్యాయత్నం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన సుధాకర్.. ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. న్యాయ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం పోలీసులతో వ్యవహరిస్తోంది. రఘురామరాజు కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చినపుడు తనపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని చెప్పారు. ఇవాళ ఫిర్యాదులో మాత్రం ఐపీఎస్ అధికారులు పీఎసార్, సునీల్ కుమార్ దాడి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సమయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా అమాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా సునీల్ కుమార్, పీయస్సార్ దాడి చేస్తే మెజిస్ట్రేట్ ముందు మూడేళ్ల క్రితమే రఘురామ రాజు చెప్పాలి కదా? 11వ తేదీన ఫిర్యాదు వస్తే 10వ తేదీన లీగల్ ఒపీనియన్ కు ఎలా పంపారు? కక్ష పూరితమైన ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. రఘురామరాజు మళ్లీ ఇలా చేస్తే విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు ఇబ్బందులు తప్పవని, ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదని అసహనం వ్యక్తం చేశారు.

Also Read: ‘తల్లికి వందనం’పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన.. రూ.15వేలు రావాలంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు