🔴Live Breakings: కొత్త పార్టీ పెడుతున్నా.. జాగృతి నేతలతో కవిత సంచలన భేటీ!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందన్నారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అర్ధరాత్రి బయటకు గెంటేస్తే బీసీల హక్కులు ఎందుకు గుర్తు రాలేదని కవితపై ఫైర్ అయ్యారు రఘునందన్.
కార్యకర్తలే టీడీపీకి అసలు సిసలైన అధినేతలని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలేనని, ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం తగ్గలేదంటూ కడప మహానాడు సభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అన్నారు.
NTR, YSR, KCRల పేర్లు చెప్పుకుంటూ పురందేశ్వరీ, షర్మిలా, కవిత రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ అధికారాన్ని కోసం కుటుంబంతో వేరై పురందేశ్వరీ, షర్మీలా ఉన్నారు. త్వరలోనే కవిత కూడా ఆబాటలో నడుస్తారని చర్చ. కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఉప కులాలకు చెందిన వారిని కాకుండా అసలైన మాదిగకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని మీటింగ్ లో నిర్ణయించారు.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 18 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో నలుగురు PLGA సభ్యులున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 10 మందిపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న కవితతో కేసీఆర్ రాయబారం మొదలుపెట్టారు. స్వయంగా కూతురుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీలో తన సంగతి ఏంటో తేల్చాలని పట్టుబట్టిన కవితను బుజ్జగించేందుకు దామోదర రావు, గండ్ర మోహనరావును ఆమె దగ్గరకు పంపించారు.
కొత్త పార్టీ వార్తల నేపథ్యంలో.. MLC కవిత ఈ రోజు సింగరేణి ప్రాంత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం అయ్యారు. తన లేఖ బయటకు రావడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై కవిత వారితో చర్చిస్తున్నారు. కొత్త పార్టీపై వారి అభిప్రాయాలను కవిత తెలుసుకుంటారన్న చర్చ సాగుతోంది.
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో మరో వివాదం చర్చనీయాంశమైంది. లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ మరో యువతితో రిలేషన్షిప్ పోస్టు నెట్టింట వైరల్ కావడం సంచలనం రేపుతోంది. తేజ్ భార్య ఐశ్వర్య తన జీవితం నాశనం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.