🔴Live News: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు శ్రమదానం చేశారు. స్థానిక గురుకుల పాఠశాలను మంత్రి పొంగులేటి, ఇతర నేతలతో కలిసి ఆమె సందర్శించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.
పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ గా మారింది. BRS పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త విగ్రహాన్నే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నేత SI కాలర్ పట్టుకున్నాడు.
జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను కవిత నేడు ప్రారంభించారు. BRS, జాగృతి KCRకు 2 కళ్లని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడేందుకు ఆమె రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. BCల కోసం రైల్‌రోకో, KCRకు నోటీసులపై ధర్నాకు సిద్ధమైయ్యారామె.
BRS ఎమ్మెల్సీ కవిత శనివారం జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌కు BRS, జాగృతి రెండు కళ్ల లాంటివని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 18ఏళ్లగా ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళలు యాక్టీవ్‌గానే ఉన్నారు. లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్ తెలుగు దేశం, విజయ శాంతి తెలంగాణ ఇంటి పార్టీ, షర్మిలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు పెట్టారు. కవిత కూడా ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని వార్తలు వస్తున్నాయి.
KCR పార్టీ పగ్గాలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత ఇష్యూ BRSలో సంచలనంగా మారింది. కవిత, కేటీఆర్‌ల మధ్య విభేదాలు హరీశ్ తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు. ఫాంహౌస్‌లో KCRతో వారం రోజుల్లో 4సార్లు హరీష్ భేటీ అయ్యారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని ఆయన అన్నారు. కరీంనగర్ నుంచి నాపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. పరోక్షంగా ఆయన బండి సంజయ్‌ని టార్గెట్ చేసిన కామెంట్స్ చేశారు.
కవిత, షర్మిల మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి భర్తల పేర్లు అనిల్, ఇద్దరూ అన్నలపై ఆరోపణలు చేశారు. ఇద్దరూ అన్నతో కలిసి పార్టీ కోసం పని చేశారు. తర్వాత సొంత గుర్తింపు కోసం పోరాడుతున్నారు. కవిత లేఖతో BRS పరిణామాలు ఆసక్తిగా మారాయి.