మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు-VIDEO
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమీకరణాలు మారాయన్నారు.
అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎలోన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించడంతో మూడవ పార్టీల పాత్రపై చర్చ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఎలన్ మస్క్ పార్టీ ముందున్న సవాళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇటీవల జైలు నుంచి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజు కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కొడాలి నాని వెంట మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంది? ఆయన అకస్మాత్తుగా ఎందుకు ఆస్పత్రిలో చేరారు? ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి? అన్న అంశంపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిన్న సాయంత్రం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, సోడియం స్థాయిలను పర్యవేక్షించడానికి ఆయన వైద్యులు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారన్నారు.
బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ కు లేఖ రాయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీంతో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఆందోళనకు కేసీఆర్ ఒప్పుకుంటారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
నిజామాబాద్ లో తనను ఓడించింది సొంత పార్టీ నేతలేనని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసన్నారు. ఎప్పుడో సారి తాను సీఎం అవుతానన్నారు. సీబీఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి తనకు రావాల్సినంత సపోర్ట్ రాలేదన్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. ఓ కార్యకర్త రాజాసింగ్ కు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు. స్పందించిన రాజాసింగ్ హైకమాండ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురే పార్టీని నాశనం చేస్తున్నారన్నారు