BIG BREAKING: వైసీపీ లీడర్ దారుణ హత్య.. కత్తులతో వేటాడి దారుణంగా..!
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తూ కోవూరులో ఇమామ్ భాషా అనే కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పరామర్శించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చర్చకు రావడానికి సిద్ధమన్నారు. తులం బంగారం, పింఛన్లు పెంపుపై చర్చిద్దామన్నారు.
ఏపీలో నేడు 'మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0' కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల ప్రాంగణంలో జరుగుతుంది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ హస్తిన బాట పట్టారు. తాను పార్టీకి రాజానామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై హైకమాండ్ పెద్దలకు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్లపై సైతం ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనతో నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. ఈ సంఘటనకి మూల కారణం కోవూరులో వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, తన ప్రత్యర్థి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు.
డమ్మీ కాదని నిరూపించుకునేందుకు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని రాంచందర్ రావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేయడం బీజేపీలో సంచలనంగా మారింది.
42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారన్నారు.
సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిలను నియమించింది. అద్దంకి దయాకర్-కరీంనగర్, జగ్గారెడ్డి-హైదరాబాద్, పొన్నం-మెదక్, అడ్లూరి లక్ష్మణ్-వరంగల్, సంపత్ కుమార్ - నల్గొండ, కుసుమకుమార్ - మహబూబ్ నగర్ కు ఇన్ఛార్జిగా నియమించింది.