Radhan Pandit: విజయ్ సంచలన గెలుపు.. నెట్టింట వైరల్ అవుతున్న జ్యోతిష్యుడు.. ఎవరీ రాధన్ పండిట్?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ పేరు వైరల్ అవుతోంది.

New Update
Radhan Pandit

Radhan Pandit

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ పేరు వైరల్ అవుతోంది. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా విజయ్ విజయాన్ని అంచనా వేయలేకపోయిన దాన్ని జ్యోతిష్యుడు రాధన్ పండిట్ మాత్రం ముందే గెలుపును పసిగట్టారు. అయితే ఈ రాధన్ పండిట్ ఎవరు? విజయ్ విషయంలోనే కాకుండా ఇంతకు ముందు ఇతను చెప్పిన ఫలితాలు నిజమయ్యాయా? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

విజయ్ గెలుస్తాడని గతంలోనే రాధన్ పండిట్ జోస్యం చెప్పారు. రాజకీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను వెనుకకు పెట్టి విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. తాజా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ 108కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే విజయ్ స్వయంగా పెరంబూర్‌లో భారీ మెజారిటీతో గెలవడంతో పాటు, తిరుచ్చిలో మెజార్టీలో ఉండటంతో రాధన్ పండిట్ జోస్యం నిజమైందని నెటిజన్లు అంటున్నారు. కేవలం గెలుపు విషయంలో మాత్రమే కాకుండా.. ఓటింగ్ శాతం విషయంలో కూడా ఆయన చెప్పిన వాటికి దగ్గరగా ఫలితాలు ఉన్నాయి. రాధన్ పండిట్ గ్రహాల సంచారం, నాయకుల జాతక చక్రాలను చూసి ఫలితాలు చెబుతుంటారు. గతంలో ఇతను చెప్పిన జాతకాలు అన్ని చాలాసార్లు నిజమయ్యాయి. విజయ్ జాతకాన్ని కూడా ఇలానే పరిశీలించి తెలిపారు.

గ్రహ స్థితులు బలంగా ఉన్నాయని..

విజయ్ జాతకంలో గ్రహ స్థితులు అత్యంత బలంగా ఉన్నాయని, ఆయనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని ముందే రాధన్ పండిట్ చెప్పారు. ఈ ఎన్నికల సమయంలో చాలా మంది విజయ్ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసినా.. రాధన్ పండిట్ మాత్రం తన అంచనాకు కట్టుబడి ఉన్నారు.  ప్రస్తుతం విజయ్‌కు రాజయోగం నడుస్తోందని.. దీనివల్ల ఆయనకు అధికారం దక్కుతుందని రాధన్ పండిట్ ముందుగానే చెప్పారు. ఆయన చేపట్టిన 'తమిళగ వెట్రి కజగం' పార్టీ పేరు కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం విజయానికి అనుకూలంగా ఉందని వివరించారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైందని, విజయ్ పాలనలో ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆయన ముందే తెలిపారు. ఇప్పుడు విజయ్ విషయంలో మాత్రమే కాకుండా.. గతంలో కూడా రాధన్ పండిట్ చెప్పిన విషయాలు నిజమైనట్లు తెలుస్తోంది.

2016లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం గురించి రాధన్ పండిట్ ముందే చెప్పారు. అలాగే 2021 ఎన్నికల్లో స్టాలిన్ విజయం సాధించడం ఖాయమని అంచనాలు వేశారు. అప్పట్లో రాధన్ అంచనాలు నిజమై డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే డీఎంకే అధినేత స్టాలిన్ జాతకం కూడా బాగాలేదని ముందుగానే రాధన్ అంచనా వేశారు. ప్రస్తుతం కఠినతర పరిస్థితులు ఎదుర్కొంటారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌కు గ్రహస్థితి అనుకూలంగా ఉందని తెలిపారు. కానీ ఫలితాలు మాత్రం పరిమితంగానే ఉంటాయన్నారు. అలాగే పళనిస్వామికి ప్రస్తుతం బలమైన జాతకం ఉందన్నారు.

Advertisment
తాజా కథనాలు