మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణాల్లో తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదికను విడుదల చేసింది. భద్రాద్రి ప్లాంట్‌తో వచ్చే 25 ఏళ్లలో ప్రజలపై రూ.9వేల కోట్ల భారం పడనున్నట్లు నివేదికలో తేలింది.
ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా
కేసీఆర్‌తో పాటు మరికొందరిపై..
ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రూ.3,642 కోట్ల నష్టం జరిగిందని జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికలో తెలిపింది. ఈ నివేదికపై అసెంబ్లీలో కూడా చర్చించనున్నారు. దీంట్లో ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయో వారందరిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా
గత పదేళ్ల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ డిస్కమ్‌లను ఆర్థికంగా కుప్పకూల్చారని, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. వీటివల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చే 25 ఏళ్ల పాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ నివేదికలో తెలిపారు.
ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్
ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!