Madhavilatha vs JC prabhkar reddy : మాధవీలత, జేసీ మధ్య ముదురుతున్న వివాదం

సినీనటి మాధవీలత, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య న్యూఇయర్‌ సందర్భంగా మొదలైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.

New Update
ap

Madhavilatha vs JC prabhkar reddy

Madhavilatha vs JC prabhkar reddy : సినీనటి, బీజేపీ నాయకురాలు మాధవీలత, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య న్యూఇయర్‌ సందర్భంగా మొదలైన వివాదం మరింత ముదురుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి మహిళలకోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడాన్ని మాధవీలత తప్పుపట్టారు. దీంతో ఆయన మాధవీలతను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీంతో ఆయనపై మాధవీలత న్యాయపోరాటానికి దిగారు.నటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినా మాధవీలత మాత్రం తనకు న్యాయం జరిగేవరకు పోరాడుతానని స్పష్టం చేసింది.

Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

అందుభాగంగా మాధవీలత మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించి, తన పరువుకు భంగం కలిగించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు. తాను గత 15ఏళ్లుగా సైబరాబాద్ కమిషనరేట్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో జేసీ వ్యాఖ్యలపై సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసినట్లు మాధవీలత వెల్లడించారు.

Also Read: ట్రంప్ మొదట సంతకాలు చేసిన పది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవే..

 జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే మాధవీలత మా అసోషియేషన్, ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని నటి మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదు. అందుకే మూవీఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాను. 'మా' ట్రెజరర్ శివబాలాజీకి కాల్‌ చేస్తే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారు’అని మాధవీలత వెల్లడించారు.తాజాగా మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో మాధవీలత ఫిర్యాదు చేశారు.

జేసీపై హెచ్ఆర్సీకి సైతం ఫిర్యాదు

మరోవైపు ఈ వివాదం పై హెచ్‌ఆర్సీకి సైతం మాధవీలత ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మాధవీలత వెల్లడించారు. కాగా సైబరాబాద్‌ పోలీసులకు మాధవీలత రెండు కంప్లైట్స్ ఇచ్చారు. అవమానం, వేధింపుల తోపాటు ప్రాణభయం ఉందంటూ ఆమె తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఘటన న్యూఇయర్‌ సందర్భంగా జరిగినప్పటికీ మొన్నటివరకు సంక్రాంతి వేడుకల కారణంగా లేట్ గా కంప్లైంట్ చేస్తున్నానని ఆమె వెల్లడించారు. అంతే కాదు ఇష్టరీతిన నిందించి క్షమాపణ చెప్పాను అంటే సరిపోతుందా అని మాధవీలత ప్రశ్నించారు. జేసీపై ఫిర్యాదు చేసిన తర్వాత జేసీ చాలా డేంజర్‌ అని చాలామంది చెప్పారని, డేంజర్ అని నేను భయపడితే అమ్మాయిల పరిస్థితి ఏంటి కూడా అమె ప్రశ్నించారు.

Read also:  పుష్ప అంటే బ్రాండ్ అనుకుంటివా.. కాదు బ్యాడ్‌లక్..! ఇది మూడో దెబ్బ

తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్‌ రెడ్డి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవిలత వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు మాధవి లతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలపై మాధవి లత, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును తప్పుపట్టారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం.

ఇది కూడా చదవండి:  నల్లగొండలో ఉద్రిక్తత.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు!

 క్షమాపణలు చెప్పిన జేసీ

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. వయసు, ఆవేశం రీత్యా అలా మాట్లాడానని.. ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. తన వయసు 72 సంవత్సరాలు అని, నోరుజారి ఆవేశంలో మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరి బ్రతుకుతెరువు వారిదేనని అన్నారు. అదే సమయంలో బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. న్యూ ఇయర్ కు తన మీద నమ్మకంతో 14వేల మంది మహిళలు వచ్చారని.. తాను ఫ్లెక్సీలు, పాంప్లెట్ లీడర్‌ను కాదని, జనం గుండెల్లో ఉన్న నేతని అని చెప్పారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులందరూ ఫ్లెక్సీ గాళ్లేనంటూ విమర్శించారు. తాడిపత్రి కోసం ఎంత వరకైనా వెళ్తానని జేసీ మరోసారి వ్యాఖ్యానించారు. తనను వైసీపీలోకి వెళ్లు అని చెబుతున్నారని.. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో చూసుకోవాలని అన్నారు. అధికారం ఉన్నప్పుడు కాదు లేనప్పుడు మాట్లాడాలని చురకలు అంటించారు. అధికారం లేనప్పుడు వీళ్లంతా ఎక్కడున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాను చంద్రబాబు కోసమే పార్టీలో ఉన్నానని చెప్పారు. లేదంటే తనకు పార్టీ అవసరమే లేదని చెప్పారు. తనకు తాడిపత్రి ప్రజలే పార్టీ, అన్నీ అని చెప్పారు. చంద్రబాబులో 0.5 శాతమైన అభివృద్ధి చేయాలను కుంటున్నానని తెలిపారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TMC MPs: టీఎంసీ MPల వాట్సాప్ చాట్, వీడియోలు లీక్.. అన్నీ బూతులే

వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ మధ్య వివాదం చెలరేగింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీని తిడుతున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Trinamool MP (1)

Trinamool MP (1)

వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య జరిగిన వాగ్వాదం వీడియోలు, చాట్‌లను బీజేపీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ బెనర్జీ మరొ ఎంపీతో గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు ఎంపీలు తిట్టుకున్న వాట్సాప్ చాట్, వీడియోలు బీజేపీ నాయకుల కంటపడింది. దీంతో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు వీటిని విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై బూతులతో రెచ్చిపోయారు. 

ఈ సమస్యను పరిష్కరించడానికి మమతా బెనర్జీ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. AITC MP 2024 అనే వాట్సాప్ గ్రూప్ నుండి వచ్చిన స్క్రీన్‌షాట్‌ ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకున్న ఎంపీని కళ్యాణ్ బెనర్జీ హెచ్చరిస్తున్నారు. ఈసీకి వెళ్లే ముందు మెమోరాండంపై సంతకం చేయడానికి పార్లమెంట్ కార్యాలయంలో సమావేశమవ్వాలని పార్టీ తన ఎంపీలను ఆదేశించినట్లు కనిపిస్తోంది. మెమోరాండం తీసుకెళ్లిన ఎంపీ పార్లమెంటు సమావేశానికి రాకుండా నేరుగా ఈసీకి వెళ్లారు. దీని కారణంగా ఇద్దరు ఎంపీల మధ్య వివాదం చెలరేగింది. వీడియోలో కళ్యాణ్ బెనర్జీ ఇతర శాసనసభ్యుడిని దూషిస్తున్నాడు.

Advertisment
Advertisment