BIG BREAKING: రాహుల్ గాంధీపై మర్డర్ కేసు

పార్లమెంట్‌లో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్ల అతని తలకు గాయమైందని ప్రతాప్ ఆరోపించారు. ఈక్రమంలో రాహుల్‌ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
BJP Mp Prathap Singh

BJP Mp Prathap Singh Photograph: (BJP Mp Prathap Singh)

పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్ష సభ్యులు నిరసనల వల్ల అంతా గందరగోళం ఏర్పడింది. అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందని అధికార పార్టీ ఎంపీలు నిరసనలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం

ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

నెట్టేయడంతో కింద పడి..

ఇందులో భాగంగా పార్లమెంట్‌లోకి వస్తున్న అధికార పార్టీ ఎంపీలను విపక్ష పార్టీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. మెట్ల దగ్గర నిల్చోని ఉండటంతో రాహుల్ గాంధీ ఒక ఎంపీని నెట్టారట. దీంతో అతను వచ్చి ప్రతాప్ చంద్రపై పడటంతో కిందపడటంతో ప్రతాప్ చంద్ర తలకు గాయం అయ్యిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీపై పోలీసులకు మర్డర్ కేసు ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు

ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Baisaran Valley: బైసరన్‌ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!

పహల్గాంలోని బైసరన్‌ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.

New Update
Baisaran Valley

Baisaran Valley

Baisaran Valley: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) సమీపంలో ఉన్న బైసరన్‌ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి(Terror Attack) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో(All Party Meeting)  ఉగ్రదాడి అంశంపై కీలక చర్చలు జరిగాయి. ఈ దాడిపై విపక్షాలు భద్రతా యంత్రాంగ వైఫల్యాన్ని ప్రధానంగా కారణంగా ఎత్తిచూపాయి.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

దాడి జరిగిన ప్రదేశమైన బైసరన్‌కు పర్యాటకులను అనుమతించిన విషయాన్ని స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు ముందుగా తెలియచేయలేదన్న విషయం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశాన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా తమ కథనాల్లో ప్రస్తావించాయి.

అమర్‌నాథ్‌ యాత్ర(Amarnath Yatra) ప్రారంభమయ్యే జూన్‌ నెల వరకు సాధారణంగా బైసరన్‌ వంటి ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసారి స్థానిక పాలనా యంత్రాంగం ఎటువంటి సమాచారాన్ని భద్రతా వ్యవస్థలతో పంచుకోకుండా పర్యాటకులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

విపక్షాల తీవ్ర విమర్శలు..

ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే కనీసం 45 నిమిషాల నడక అవసరం. అలాంటి చోట ఎమర్జెన్సీ పరిస్థితులకు స్పందించే విధంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ అమల్లో లేకపోవడాన్ని కూడా కేంద్ర ప్రతినిధులు అఖిలపక్ష భేటీలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దాడి జరిగిన సమయంలో భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నలు గట్టిగా లేవనెత్తుతున్నాయి. అలాగే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ స్పందనపై అనేక ప్రశ్నలు సాధించారని సమాచారం.

"మహారాష్ట్ర ట్రావెల్‌ ఏజెన్సీలు బైసరన్‌ తెరిచిన విషయం తెలుసుకోగలిగితే, భద్రతా సిబ్బందికి అది తెలియకపోవడం ఎలా?" అంటూ మరో ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

పహల్గాం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బైసరన్‌ ప్రాంతాన్ని "మినీ స్విట్జర్లాండ్‌"గా పిలుస్తుంటారు. ఇక్కడి పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, అందమైన పర్వత దృశ్యాలు వేసవికాలంలో వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.

అయితే, ఏప్రిల్‌ 22న ఇక్కడ జరిగిన దారుణం ఎప్పటికీ మరువలేనిది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు, అమాయక పర్యాటకులను చుట్టుముట్టి సమీపం నుంచి కాల్పులకు పాల్పడి 28 మంది ప్రాణాలు హరించారు. ఈ దాడి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తగా, అఖిలపక్ష సమావేశం లో వాటిపై తీవ్రమైన చర్చ జరిగింది. కేంద్రం ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతోంది.

Advertisment
Advertisment
Advertisment