NDA : ఇవాళ ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం AP: ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం ఈరోజు జరగనుంది. ఈ సమావేశానికి కూటమి నేతలు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి హాజరుకానున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పని తీరు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 18 Sep 2024 | నవీకరించబడింది పై 18 Sep 2024 09:27 IST in రాజకీయాలు Short News New Update షేర్ చేయండి NDA Meeting : ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఎన్డీయే పక్ష సమావేశానికి సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి హాజరుకానున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పని తీరుపై ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు ఏపీ ఎన్డీయే అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. కాగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు తరువాత జరుగుతున్న రెండో భేటీ ఇది. Also Read : పేలిన పేజర్లు..పదుల సంఖ్యలో మృతులు! పదవుల పంపకాలు... ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పాడి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. కాగా మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేసి ఎమ్మెల్యే సంఖ్య బలం పెంచుకోగా కూటమి భాగమైన జనసేన మొత్తం 21 సెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించింది. కాగా పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీగా జనసేన రికార్డును క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ వ్యాప్తంగా నామినేటెడ్ పదవులపై చర్చ జోరుగా జరుగుతోంది. పొత్తు ఉండడంతో తమకే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న కొందరు నేతకు టికెట్ రాలేదు. అది అటు జనసేన, బీజేపీ.. ఇటు టీడీపీలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పదవుల పంపకాలపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Also Read : మీడియా ముందుకు వెళ్ళకండి..మాకు చెప్పండి– మా 100 రోజుల్లో... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 100 రోజులు పూర్తి కావొస్తోంది. అయితే 100 రోజుల్లో చేసిన పనులు, ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యచరణ వంటి ముఖ్యమైన అంశాలపై ఈరోజు ఎన్డీయే కూటమి సమావేశం కానుంది. అయితే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన నుంచి బీజేపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేన, టీడీపీ కలిపి సూపర్ సిక్స్ హామీలను ప్రకటన చేయగా.̣ ఇప్పటికే రెండు పథకాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. Also Read : భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-కారు ఢీ.. ఒకరి మృతి! #pawan-kalyan #chandrababu #nda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి