Rajadhani Files: 'రాజధాని ఫైల్స్'సినిమా ప్రదర్శన నిలిపివేత.. ఆందోళనకు దిగిన అభిమానులు 'రాజధాని ఫైల్స్' సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. రేపటి వరకు మూవీ రిలీజ్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేకర్స్ సినిమా విడుదల చేశారు. దీంతో తక్షణమే చిత్ర ప్రదర్శనలు ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. By srinivas 15 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Rajadhani Files: రాష్ట్రవ్యాప్తంగా 'రాజధాని ఫైల్స్' సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. రేపటి వరకు మూవీ రిలీజ్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేకర్స్ సినిమా విడుదల చేశారు. దీంతో తక్షణమే చిత్ర ప్రదర్శనలు ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా విడులైన థియేటర్లకు చేరుకుని పోలీసులు షోలను అడ్డుకున్నారు. ఓంగోలులో రాజధాని ఫైల్స్ సినిమాని మధ్యలో పోలీసులు ఆపేశారు. pic.twitter.com/9nIquotWDh — తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) February 15, 2024 అరుణప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు, అధికారులు ప్రజల పక్షాన పనిచేయటంలేదు..😢😢 -#RaajadhaniFiles Movie కడుపు నింపే రైతులు అంటే జగన్ రెడ్డి కి ఎందుకు అంత చులకన pic.twitter.com/Qf5A84nSyE — 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) February 15, 2024 ప్రేక్షకులు ఆగ్రహం.. ఈ మేరకు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లకు వెళ్లి ఆపేశారు. విజయవాడలో పలు థియేటర్లలో సినిమాను మధ్యలో నిలిపివేశారు. బెంజి సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్‌కు వెళ్లిన రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రదర్శన నిలిపివేయడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన కారణంగా ప్రదర్శన నిలిపేస్తున్నట్లు బదులిచ్చారు. స్టే ఆర్డర్ కాపీ చూపించాలని పలువురు ప్రేక్షకులు నిలదీయగా అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఆర్డర్ కాపీ లేకపోవడంతో సినిమా ఎలా ఆపుతారని నిలదీశారు. దీంతో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని లేనిపక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని థియేటర్ యజమానులను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ టీడీపీలో చేరిన బాచిన కుటుంబం ఇటీవలి వరకూ అద్దంకి వైసీపీ ఇంచార్జిగా భారీగా ఖర్చు పెట్టుకున్న కృష్ణచైతన్య పార్టీ మారుతారని ఆపేందుకు వ్యాపారాలపై అధికారుల దాడులు అయినా టీడీపీలో చేరిన బాచిన కుటుంబం#TDP pic.twitter.com/d7m1rfHMig — Telugu360 (@Telugu360) February 15, 2024 ఇది కూడా చదవండి : Crime: తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపిన దుండగులు ఈరోజు ఒంగోలు గోపి థియేటర్ లొ రాజధాని files సినిమా మధ్యలో నిలిపివేసిన పోలీస్ వారు. కథ లో అభ్యన్తరకరమైన సన్నివేశాలు ఉంటే సెన్సర్ బోర్డు చూసుకుంటుంది. అక్కడ ఆమోదం పొంది థియేటర్ లోకి వచ్చిన సినిమా ని ఆపటం ఏంటీ @prakasam_police. ఆ బాధ్యత లు మీరెప్పుడు చేపట్టారు pic.twitter.com/agcX3J4hZu — aruna janasena (@RayapatiAruna) February 15, 2024 టికెట్ డబ్బులు వాపస్.. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు రాజధాని ఫైల్స్ సినిమా ఆట మధ్యలో నిలిపేయడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. సీఐ వచ్చి కోర్టు స్టే ఇచ్చిందని, ప్రదర్శన నిలపి వేయాలని కోరారు. లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వాలని థియేటర్ సిబ్బంది కోరగా, అలాంటివి ఏమీ లేవంటూ ప్రదర్శనను బలవంతంగా నిలిపివేసారు. యాత్ర సినిమాలో లేని అభ్యంతరాలు రాజధాని ఫైల్స్ సినిమాలో కనిపించాయా అంటూ పలువురు ప్రేక్షకులు ప్రశ్నించారు. ప్రేక్షకులు ఆందోళన చేయడంతో థియేటర్ యజమాని టికెట్ డబ్బులు తిరిగి చెల్లించారు. #ap #rajadhani-files #movie-shows #olice-stopped మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి