/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T160748.179.jpg)
Tamil Actor Karunas: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తిరువాడనై నియోజకవర్గం మాజీ ఎమైల్య్ కరుణాస్ బ్యాగ్ లో బుల్లెట్లు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. నటుడు కరుణాస్ వ్యక్తిగత పనుల నిమిత్తం చెన్నై నుంచి తిరుచ్చి బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం జూన్ 2న చెన్నై విమానాశ్రయానికి వెళ్లారు.
బ్యాగులో 40 బుల్లెట్లు
అయితే విమానాశ్రయంలో చెక్ ఇన్ లో భాగంగా ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆయన క్యారీ-ఆన్ బ్యాగ్‌ని తనిఖీ చేయగా.. బ్యాగులో 40 బుల్లెట్లు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే ఆయన ప్రయాణాన్ని రద్దు చేసిన పోలీసులు విచారణ కొనసాగించినట్లు తెలిసింది. విచారణలో బ్యాగులో బుల్లెట్లు ఎలా వచ్చాయని పోలీసులు దర్యాప్తు చేయగా.. తన వద్ద తుపాకీ లైసెన్స్ డాక్యుమెంట్లు ఉన్నట్లు చూపించారు. ఫ్లైట్ ఎక్కే తొందరలో బ్యాగ్ లోంచి బుల్లెట్ తీయడం మర్చిపోయానని తెలిపినట్లు సమాచారం.
నటుడు కరుణాస్ విమానాశ్రయ భద్రతను ఉల్లంఘించడం ఇంకా విచారణలో ఉంది. ఈ ఘటనతో తిరుచ్చి వెళ్లాల్సిన విమానం దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సినీనటుడి బ్యాగులో 40 బుల్లెట్లు... పట్టుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు
చెన్నై విమానాశ్రయంలో సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన ప్రయాణాన్ని రద్దు చేశారు. భద్రతా అధికారులు విచారణ… pic.twitter.com/m5xmeKR9Uw
— ChotaNews (@ChotaNewsTelugu) June 2, 2024