Nayanatara: ఆ సినిమాలో అలా చూపించడంతో నయనతార పై కేసు నమోదు..!

నయనతార రీసెంట్ గా నటించిన సినిమా అన్నపూరణి. ఈ సినిమాలో లవ్‌ జిహదీని ప్రోత్సాహించేలా సీన్స్‌ ఉన్నాయని కొందరు నయనతారతో పాటు సినిమా డైరెక్టర్‌ మీద కేసులు పెడుతున్నారు.దీంతో ఈ సినిమా చిక్కుల్లో పడినట్లయ్యింది.

New Update
Nayanatara: ఆ సినిమాలో అలా చూపించడంతో నయనతార పై కేసు నమోదు..!

Annapoorani: నయనతార(Nayanatara) ఇటీవల కాలంలో నటించి విడుదల చేసిన సినిమా అన్నపూరణి. ఈ సినిమా ఏ ముహుర్తానా విడుదల అయ్యిందో కానీ ..అప్పటి నుంచి సినిమాను కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. సినిమా విడుదల అయ్యే సమయానికి చెన్నై నగరాన్ని వరదలు చుట్టుముట్టడంతో కనీసం ఈ చిత్రం వంక చూసే వారు కూడా ఎవరూ లేరు.

దీంతో థియేటర్లలో అన్నపూరణి (Annapoorani)చతికిల పడింది. దీంతో దీనిని ఇతర భాషాల్లోకి విడుదల చేశారు. దాంతో సినిమా కొంచెం ఫర్వాలేదనపించింది కానీ పెద్దగా హిట్‌ కాలేదు. దీంతో సినిమాని ఓటీటీలోకి విడుదల చేయడానికి రంగం సిద్దమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఓ పెద్ద చిక్కొచ్చి పడింది.

పెద్ద ఛెఫ్‌ కావాలని...

అది ఏంటంటే సినిమాలో డైరెక్టర్‌ నయన తారని సనాతన బ్రహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా చూపించాడు. ఆ కుటుంబంలో జన్మించినప్పటికీ పూరణికి చిన్నతనం నుంచి కూడా పెద్ద ఛెఫ్‌ కావాలని కలలు కంటుంది. అనుకున్నట్లుగానే ఆ కోర్సులో జాయిన్‌ అవుతుంది. అక్కడ ఓ ముస్లిం అబ్బాయిని ఇష్టపడుతుంది .వారి ఇంటికి వెళ్తుంది. అక్కడ బిర్యానీ చేయడం నేర్చుకుంటుంది.

ఆ క్రమంలో హీరో తల్లి బిర్యానీ చేయాలంటే అల్లా దీవెనలు కావాలని చెప్పడంతో ఆమె బుర్ఖా వేసుకుని మరీ ప్రార్థన చేస్తుంది. ఆ తరువాత క్లాస్‌ లు జరుగుతున్న సమయంలో ఆమె చికెన్‌ తింటుంది. దానిని తండ్రి కూడా చూస్తాడు. దీనిని అంతా చూస్తుంటే సినిమా ఓ యువతి కల కోసం చేసే పోరాటంలా లేదు.

లవ్‌ జివాదీ..

లవ్‌ జివాదీ(Love jihadi) లా ఉంది అంటూ కొందరు సినిమా మీద తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే సినిమాతో పాటు, నయనతార మీద కూడా కేసులు పెడుతున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ అనుకున్న కథ ఒకటి..బయట ప్రేక్షకుని మైండ్ కి చేరిన కథ ఒకటి కావడంతో ..అనుకున్నది ఒకటి ..అయినది ఒకటి ..బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్ట అన్నట్లు తయారు అయ్యింది అన్నపూరణి సినిమా.
మరి దర్శకుడు, నయనతార దీని గురించి ఏం చేస్తారో చూడాలి.

Also read: నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే బెంగళూరు సీఈవో క్రైమ్ కథ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Imanvi Esmail నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగిలేరు. నేను గర్వించదగ ఇండోఅమెరికన్. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయండి అని పోస్ట్ పెట్టింది.

New Update
Actress Imanvi: ప్రభాస్ హీరోయిన్ గా మిలటరీ ఆఫీసర్ కూతురు..! ఎవరీ ఈ బ్యూటీ..?

Fauji Actress Imanvi:  పహాల్గమ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు మన సినిమాల్లో నటించడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి వీల్లేదని సోషల్ మీడియా పోస్టుల రూపంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ప్రభాస్ ' ఫౌజీ'  హీరోయిన్ ఇమాన్వీ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఆమె పాకిస్థానీ మూలాలు ఉన్న అమ్మాయని, అమెరికాలో సెటిల్ అయ్యేముందు ఆమె తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో మేజర్ గా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో  నెటిజన్లు సినిమా నుంచి ఆమెను బ్యాన్ చేయలాంటు పోస్టులు చేయడం మొదలు పెట్టారు.

నేను పాకిస్థానీ కాదు..  

ఈ నేపథ్యంలో తాజాగా నటి ఇమాన్వీ ఈ వివాదంపై స్పందించింది. తాను పాకిస్థానీ కాదంటూ స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. అలాగే ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. 

ఇమాన్వీ పోస్ట్.. 

ఇమాన్వీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నా కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ పుకార్లను, అబద్దాలను  నేను పరిష్కరించాలనుకుంటున్నాను.  నా కుటుంబంలో ఎవరూ ఇప్పటివరకు పాకిస్థానీ మిలిటరీతో ఏ విధంగానూ సంబంధం కలిగిలేరు. ద్వేషాన్ని పుట్టించాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు యువతగా వలస వచ్చారు. ఆ తర్వాత అమెరికా పౌరులుగా మారారు.  నేను హిందీ, తెలుగు, గుజరాతీ,  ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన ఇండోఅమెరికన్  అంటూ క్లారిటీ ఇచ్చింది. కొన్ని పేరున్న వార్త సంస్థలు కూడా నా గురించి కనీస రీసర్చ్ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి అంటూ రాసుకొచ్చారు. 

ఇమాన్వీ అమెరికాలోని విశ్వవిద్యాలయంలో తన విద్యాబ్యాసాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా, నటిగా, కొరియోగ్రాఫర్‌గా, పనిచేస్తూ కళల పట్ల తన ఇంట్రెస్ట్ కొనసాగించానని.. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో పనిచేసే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు అని తెలిపింది. 

telugu-news | cinema-news | actress-imanvi | Prabhas Fauji | latest-news

Advertisment
Advertisment