Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్..!!

భక్తులతో శబరిమల కిక్కిరిసిపోతుంది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్..!!

శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నది నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తులను మధ్యలో నిలిపేశారు. రద్దీని నియంత్రించేందుకు ఈవిధంగా చర్యలు తీసుకోవల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. భక్తులను నియంత్రించే క్రమంలో వారిపై పోలీసులు లాఠఛార్జీ చేశారు. దీంతో అయ్యప్ప భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు 5 కంపార్ట్ మెంట్లలో నిండిపోయారు. దర్శనం కోసం గంటలతరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శబరిమ మార్గ మధ్యలోనే భక్తులను గంటలతరబడి నిలిపివేస్తున్నారు. కానీ వేలాదిగా తరలివస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు కూడా లేవు. దీంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలతరబడి నిల్చుని ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దాదాపు పది గంటలకు పైగా భక్తులు మార్గ మధ్యలోనే నిల్చుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

కాగా నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేశారు పోలీసులు. తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చిబెట్టారు. చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసారు భక్తులు. దీంతో అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. అయ్యప్ప స్వాములకు కనీసం మంచి నీళ్ళు కూడా ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అందించడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది..ఈ మూలికలు, మసాల దినుసులతో మీ ఇమ్యూనిటీని పెంచుకోండి…!!

Advertisment
Advertisment
తాజా కథనాలు