ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు జవాన్ పై పోలీసుల దాడి.! అనకాపల్లి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు ఓ సైనికుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పరవాడ సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. By Jyoshna Sappogula 08 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Police Attack On Army Employee: దేశంలో మనమంతా ప్రశాంతంగా జీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తల్లిదండ్రులను, భార్య పిల్లలను అందరిని వదిలి దేశం కోసం పోరాడుతుంటారు. దేశం కోసం వారు చేసే త్యాగాలు, వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా, మంచు కొండల్లో, గడ్డ కట్టే చలి, ఏడారులు, లోయల్లో నిద్రాహారాలు మానుకుని భద్రత కల్పిస్తుంటారు మన సైనికులు. కానీ, అలాంటి ఓ ఏపీ సైనికుడు సొంతూరుకి తిరిగి వస్తుంటే ఘొరంగా అవమానించారు ఏపీ పోలీసులు. Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు పరవాడలో ప్రజా స్వామ్యానికి తల వంపులు తెచ్చేలా ప్రవర్తించారు ఏపీ పోలీసులు. మహిళా కానిస్టేబుల్‌తో సహా నలుగురు పోలీసులు ఓ సైనికుడిపై దండయాత్రకు దిగారు. వందలాది మంది చూస్తుండగా ఆ జవాన్ ను అతి దారుణంగా అవమానించారు పోలీసులు. మంగళవారం పరవాడ సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే.. పరవాడ పోలీసులు మంగళవారపు సంతలో దిశ సబ్ స్రిృప్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే కేవలం మహిళల రక్షణకు నిద్దేశించిన ఈ యాప్‌ను స్త్రీ పురష భేదం లేకుండా అందరి ఫోన్‌లో డౌన్ లోడ్ చేసేందుకు మహిళా కానిస్టేబుల్ చేసిన ప్రయత్నం ఘర్షణ కు కారణమైంది.సయ్యద్ అలీముల్లా దువ్వాడలో సెక్టార్ 10లో నివశిస్తూ జమ్మూ కాశ్మీర్ లో 52 రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ సోల్జర్ గా పనిచేస్తున్నాడు. సెలవు పై వచ్చిన ఆయన సొంతూరు ఎలమంచిలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంతబయల బస్ స్టాప్ లో వేచి ఉన్నాడు. ఆయన వద్దకెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని దిశ యాప్ డౌన్‌లోడ్ చేసింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఫోన్ కు వచ్చిన ఒటిపి పాసువర్డ్ చెప్పాలని కానిస్టేబుల్ ను పట్టుబట్టడంతో ససేమీరా అన్నాడు. పాస్‌వర్డ్‌ను తానే ఎంటర్ చేస్తాననడంతో పాటు నేమ్ ప్లేట్ లేనందున గుర్తింపు కార్డు చూపితే ఒటిపి చెబుతానన్నాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ రెచ్చిపోయి ప్రవర్తించింది. జవాన్ పై చేయిచేసుకుంది. ప్రభుత్వం స్త్రీ పురష బేధం లేకుండా అందరితో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించమని తమను ఆదేశించిందని చెప్పింది. ప్రభుత్వ అర్డర్ ఉంది కాబట్టే తాము చేస్తున్నామని ఘర్షణకు దిగింది. దీంతో నిర్ఘంతపోయిన సైనికుడు దేశ సరిహద్దు కాశ్మీర్లో పనిచేసే తనకు దిశా యాప్ ఎందుకని ఎదురు ప్రశ్న వేశాడు. స్థానికులు ఆయనకు సపోర్ట్ చేయడంతో పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ స్టేషన్ కి ఫోన్ చేశాడు. వెంటనే నలుగురు సిబ్బంది హుటాహుటిన స్టేషన్ నుంచి అక్కడకు అటోలో చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కనుక్కోకుండానే అమాంతం నలుగురు మీదపడి దాడి చేశారు. దీంతో ఆ జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఐడీ కార్డు అడిగినందుకే పోలీసులు కొడతారా ? అని ప్రశ్నించాడు. OTP చెప్పమనడంతో అనుమానం వచ్చి..పోలీసులను ఐడీ అడిగానని..అయితే, వారు ఎందుకు చూపించాలని ప్రశ్నించారన్నారు. ఆర్మీలో పనిచేస్తున్నా అని చెప్పినా..లాక్కెళ్లారని.. కాలుతో తన్నారని అన్నాడు. లేడీ కానిస్టేబుల్ దవడపై కొట్టడంతో చాలా బాధవేసిందని వాపోయాడు. ఇలాంటి పోలీసులకు తగిన బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని జవాన్ అలీమూల్లా డిమాండ్ చేశారు. #jagan #ap-police #andharapradesh #army-jawan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి