Jagan vs TDP : 'రాష్ట్రానికి, పోలవరానికి జగన్ ఒక శని...' టీడీపీ ఘాటు విమర్శలు!

పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చితే అది తివ్రమైన విపత్తుకు దారి తీస్తుందని 2019లో నాటి వైసీపీ సర్కార్‌కు జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఆ లెటర్‌ను ఇప్పుడు టీడీపీ వైరల్‌ చేస్తోంది. రివర్స్‌ టెండర్‌ ఆలోచన సరైనది కాదని మండిపడుతోంది. రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ అని ఫైర్ అవుతోంది.

New Update
Jagan vs TDP : 'రాష్ట్రానికి, పోలవరానికి జగన్ ఒక శని...' టీడీపీ ఘాటు విమర్శలు!

Polavaram Project Reverse Tendering : జీవనది గోదావరిపై నిర్మించ తలపెట్టిన పెద్ద ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project). దీనిని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వరప్రదాయనిగా భావిస్తారు. దానిలో మరో మాట కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సాగు, తాగు నీరు ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి లోనూ పారిశ్రామిక అవసరాలను తీర్చడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది మొదలు ఎదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల కొరత, రాజకీయ కారణాలతో రోజులు గడుస్తున్నా ప్రాజెక్ట్ పనులు మాత్రం పూర్తి కావడంలేదు. దీనికి జగనే కారణమని టీడీపీ (TDP) నిత్యం విమర్శలు గుప్పిస్తోంది.. ఈ క్రమంలోనే నాడు కేంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే.జైన్ 2019లో రాసిన లెటర్‌ను టీడీపీ సోషల్‌మీడియాలో వైరల్ చేస్తోంది.

publive-image

రివర్స్ టెండరింగ్‌ వద్దు:
'కాంట్రాక్టర్‌ని మార్చవద్దు, ఇది తీవ్రమైన విపత్తుకు దారి తీస్తుంది..ఇది 'హంబుల్' అడ్వైజ్' అని కేంద్రం వేడుకున్నా, జగన్‌ వినకుండా, పోలవరాన్ని నాశనం చేశారని టీడీపీ విమర్శిస్తోంది. నాటి వైసీపీ (YCP) ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే.జైన్ 16-08-2019న, జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిలో చాలా స్పష్టంగా రీ టెండరింగ్ నిర్ణయం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండర్లు నిర్వహించాలనే ఆలోచన మానుకోవాలని, ఇది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, మేము ఇచ్చే 'హంబుల్' అడ్వైజ్ అని రాసి ఉంది. వీటిని పట్టించుకోకుండా జగన్‌ ముందుకు వెళ్లారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రానికి, పోలవరానికి జగన్ ఒక శని అని ఘాటుగా కామెంట్స్ చేస్తోంది.

జాతీయ ప్రాజెక్టుగా..:
ఈ ప్రాజెక్టును 2014లో జాతీయ ప్రాజెక్టు (National Project) గా ప్రకటించారు. దీనికి 2013-14లో అంచనా వ్యయం 20,398.61 కోట్ల రూపాయలు. 2017-18 నాటికి అది 55,548.87 కోట్లకు చేరుకుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం మొదటి అంచనా 20,39.61 కోట్లు మాత్రమే తమకు సంబంధం అని 2016లో ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పునరావాసానికి 33,198.23 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. కేంద్రం అప్పట్లో పార్లమెంట్‌లో తెలిపిన దాని ప్రకారం ఈ ప్రాజెక్టు 2024 జూలై నాటికి పూర్తవ్వాలి.

Also Read: రోహిత్‌, కోహ్లీకి భజన.. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్‌ ప్రత్యేక పూజలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు