BREAKING: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్!

ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.75వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నామని.. కోటి గృహాలకు లబ్ది చేకూరేలా చేస్తామన్నారు.

New Update
PM Surya Ghar: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కోటి గృహాలకు ఫ్రీ కరెంట్

ప్రధాని మోదీ దేశ ప్రజలకు మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పారు. మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రూ.75వేల కోట్లకు పైగా పెట్టుబడితో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. దీని ద్వారా కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.


ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే సబ్‌స్టాంటివ్ సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి వ్యయభారం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని మోదీ తెలిపారు. వాటాదారులందరూ జాతీయ ఆన్‌లైన్ పోర్టల్‌తో ఏకీకృతం చేయబడతారని క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఆదాయంతో పాటు తక్కువ విద్యుత్ బిల్లులు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.

ఈ స్కీమ్ కింద అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..?

Step-1
https://solarrooftop.gov.in/consumerRegistration పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

Step-2
వినియోగదారుడి నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి

Step-3
అప్రూవల్‌ వచ్చిన తర్వాత డిస్కమ్‌ అనుమతి ఉన్న వెండర్‌ ద్వారా సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి

Step-4
సోలార్‌ ప్లాంట్‌ వివరాలు సమర్పించి మీటర్‌కు అప్లికేషన్‌ పెట్టుకోవాలి

Step-5
మీటర్‌ పెట్టిన తర్వాత డిస్కమ్‌ అధికారులు తనిఖీ చేసి సంబంధిత వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు

Step-6
డిస్కమ్‌ రిపోర్టు వెరిఫికేషన్‌ తర్వాత సబ్సిడీ నగదు వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది

రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీలో రెండు కేటగిరిలు

మొదటి కేటగిరి:
0-3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.18 వేల సబ్సిడి
3-10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.9 వేల సబ్సిడి

స్పెషల్‌ కేటగిరి:
0-3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.20 వేల సబ్సిడీ
3-10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ. 10 వేల సబ్సిడీ
(సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, లక్షద్వీప్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌లోని విద్యుత్‌ వినియోగదారులకు మాత్రమే స్పెషల్‌ కేటగిరి వర్తిస్తుంది)

2024 జనవరి 1 తర్వాత నేషనల్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేవాళ్లకు సబ్సిడి వర్తింపు

మేడిన్‌ ఇండియా సోలార్‌ ప్యానెల్స్‌/మాడ్యూల్స్‌ మాత్రమే వినియోగించాలి

సోలార్‌ ఇన్సిస్టిలేషన్‌కు సంబంధించి వెండర్‌ నుంచి ధృవీకరణ పత్రం అవసరం

డిస్కమ్‌ ధృవీకరించిన మొత్తం సోలార్‌ మాడ్యూల్‌ కేపాసిటీ, ఇన్వర్టర్‌ కెపాసిటీ ఆధారంగా సబ్సిడిని లెక్కిస్తారు

రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ అంటే ఏమిటి..
ఇంటి పైకప్పుపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను అమరుస్తారు. ఈ ప్యానెళ్లలో సోలార్ ప్లేట్లను ఉంచుతారు. సూర్యకిరణాల నుంచి  శక్తిని గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత ఇది. సౌరశక్తిని విద్యుత్తుగా మార్చే ప్యానెళ్లలో ఫోటోవోల్టాయిక్ కణాలు అమర్చబడి ఉంటాయి. పవర్ గ్రిడ్ నుంచి వచ్చే విద్యుత్ మాదిరిగానే ఈ విద్యుత్ కూడా పనిచేస్తుంది.

ఎంత ఖర్చు అవుతుంది అంటే..
సౌర ఫలకాల నుంచి  విద్యుత్తును  ఉత్పత్తి చేసే ఖర్చు ప్యానెల్ మాడ్యూల్, ఇన్వర్టర్‌పై ఆధారపడి ఉంటుంది. 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ అమర్చడానికి రూ.45 నుండి 85 వేల వరకు ఉంటుంది. ఇది కాకుండా, బ్యాటరీ ఖర్చు ఉంటుంది. అదేవిధంగా 5 కిలోవాట్ల సోలార్ ప్యానల్ ఏర్పాటుకు రూ.2.25 నుంచి 3.25 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, మీరు కరెంటు బిల్లు ఖర్చును చూస్తే, మీ బిల్లు 5-6 సంవత్సరాల తర్వాత జీరో అవుతుంది, ఎందుకంటే మొత్తం ఖర్చు 5-6 సంవత్సరాలలో రికవరీ అవుతుంది.

Also Read: RTV ఎక్స్‌క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..!
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు