Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..!

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ మొత్తం 280 మంది చేత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

New Update
Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..!

Parliament Meetings : ఢిల్లీ (Delhi) లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎంపీగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో పాటు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ మొత్తం 280 మంది చేత లోక్‌సభ (Lok Sabha) సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలి రోజు 280మంది ప్రమాణం చేయగా.. మిగిలిన ఎంపీలు రేపు ప్రమాణం చేస్తారు.

Also Read: పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..!

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామన్నారు. 18వ లోక్ సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్లు!

సెలవుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతోందని,దాని వల్ల దేశ పురోగతి నెమ్మదిస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన క్లీన్‌ రూమ్స్‌ కంటైన్‌మెంట్‌ సీఈవో రవికుమార్‌ తుమ్మలచర్ల పోస్టు చర్చకు తెరలేపింది.ఈ విషయం గురించి నెటిజన్లు మండిపడుతున్నారు.

New Update
jobs

jobs

దేశంలో పని గంటల పై గత కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది.భారత్‌ లో అనేక సెలవుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతోందని,దాని వల్ల దేశ పురోగతి నెమ్మదిస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ సీఈవో చేసిన పోస్టు సరికొత్త చర్చకు తెరలేపింది.

Also Read: GT vs KKR: చేజారిపోతున్న మ్యాచ్.. కట్టడి చేస్తున్న గుజరాత్ బౌలర్లు - కెకెఆర్ 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?

ఒక్క ఏప్రిల్‌ లోనే పది కంటే ఎక్కువ సెలవులతో కార్యాలయాల్లో దస్త్రాలు ఎక్కడికక్కడే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ,ఐచ్ఛిక సెలవుల్ని ఓవర్‌ లోడ్‌ గా పేర్కొన్న ఆయన..దేశంలో హాలిడేకల్చర్‌ పై పునరాలోచించాల్సిన సమయం ఇదేనన్నారు.

Also Read: దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

చైనాతో పోలుస్తూ చేసిన ఈ పోస్టు కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన అభిప్రాయంతో విభేదిస్తూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అధిక సెలవుల కారణంగా పని ముందుకు వెళ్లట్లేదని ఏప్రిల్‌ లో  సెలవుల జాబితాను ఉటంకిస్తూ క్లీన్‌ రూమ్స్‌ కంటైన్‌మెంట్‌ సీఈవో రవికుమార్‌  తుమ్మలచర్ల ఇటీవల తన లింక్‌ డ్ ఇన్‌ లో ఓ పోస్టు చేశారు. పని దినాలకొరత...దేశ పురోగతిని అడ్డుకోవడమే కాకుండా ప్రపంచంలో భారత విశ్వసనీయతను కూడా కుంటుపడేలా చేస్తోంది.

దేశ సాంస్కృతిక,ఆధ్యాత్మిక గొప్పతనాన్ని గౌరవిస్తున్నప్పటికీ..వీకెండ్స్‌,ప్రభుత్వ,ఐచ్ఛిక సెలవులు పనులకు ఆటంకంగా నిలుస్తున్నాయి. ఒక్క ఏప్రిల్‌ లోనే  పది కన్నా ఎక్కువ సెలవులు ఉన్నాయి. అనేక ఆఫీసుల్లోవారాల తరబడి ఫైల్స్‌ ముందుకు కదల్లేదు. చైనా మనకన్నా 60సంవత్సరాలు ముందుంది.ఎందుకంటే అక్కడ ఆర్థిక గమనాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటారు అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సెలవుల సంస్కృతి పై పునరాలోచించి..తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన నరేంద్రమోదీ,కేంద్ర కార్మిక శాఖ మంత్రికి విజ్ఙప్తి చేశారు.రవి కుమార్‌ పోస్టు పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మనం యంత్రాలమా? భారత సంప్రదాయాలు,సంస్కృతి  గొప్పతనం మీకు తెలుసా? అని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టగా...ఎక్కువ సెలవులు గురించి ఒకరు ఫిర్యాదు చేయడం తాను ఎన్నడూ చూడలేదంటూ మరో యూజర్‌ స్పందించారు.

భారత్‌ చైనా సామాజిక రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకుండా రెండింటినీ పోల్చి చూడటం సరైనది కాదు.మన దేశ ప్రత్యేక అవసరాలకు తగిన పరిష్కారాలు మనకు ముఖ్యం.సెలవుల్ని ఒక అడ్డంకిగా చూసే బదులు..పనిలో ఉన్న అంతరాయాలను తగ్గించే మార్గాలను అన్వేషించవచ్చు అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

Also Read:VIRAL VIDEO: మాయ లేడీ.. అండర్‌వేర్స్ ఎలా చోరీ చేసిందో చూశారా? - ‘కి’లేడీ మామూల్ది కాదు భయ్యా!

Also Read: Watch Video: కన్నడ మాట్లాడలేదని ఐఏఎఫ్‌ అధికారిపై దాడి.. వీడియోలో రక్తంతో..

hyderabad | employment-news | employment | holiday culture | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | holidays | development 

Advertisment
Advertisment
Advertisment