Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..

Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

New Update
Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..

Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్న ఆయన.. తెలంగాణ ప్రజలను నా కుటుంబ సభ్యులారా అని సంబోధిస్తూ ఎన్నికల హామీలు గుప్పించారు. దశాబ్దాల కల అయిన పసుపు బోర్డును త్వరలోనే తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రధాని మోదీ. పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పసుపు విస్తృతంగా పడుతోందని, రైతుల శ్రేయస్సును, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ పుసుపు బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. ఇది సప్లయ్ చైన్ నుంచి మౌలిక సదుపాయాలు కల్పించే వరకు రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అంతేకాదు.. రూ. 900 కోట్లతో ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమ్మక్క-సారక్క పేరుతో ఈ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదే సమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిని పెంచుతున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదాబాద్ సెంట్రల్ వర్సిటీ ఉంటుందన్నారు.

ఇదిలాఉంటే.. మమహూబ్‌నగర్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. రూ. 13,500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ విషయంలో తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ప్రధాని మోదీ. నాగ్ పూర్ - విజయవాడ కారిడార్‌తో ఎంతో ఉపయోగం ఉందన్నారు. తద్వారా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో వాణిజ్యం, టూరిజం, వ్యాపారం పెరిగనుందని అన్నారు. తెలంగాణలో రోడ్, రైల్వే కనెక్టివిటీ పెరిగిందని, ఇది ప్రజలకు చాలా అవసరం అని పేర్కొన్నారు ప్రధాని మోదీ.

ఇది టీజర్ మాత్రమే అసలు కథ ముందుంది..

ఈ సభా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమరశంఖం పూరించారు. ఇందులో భాగంగానే ఆయన తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. అంతేకాదు.. అసలు కథ ముందుంది అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడున్న వేదిక కేవలం అభివృద్ధికి సంబంధించినదని, తరువాతి సభలో మనసు విప్పి మాట్లాడుకుందామని అన్నారు. తెలంగాణ ప్రజల మనసులోని మాటలే తాను మాట్లాడనంటూ ఉత్కంఠ రేపారు. మరి బీజేపీ సభావేదిక నుంచి ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారు? కేసీఆర్ టార్గెట్‌గా ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారు? అని ఆసక్తి నెలకొంది.

ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ లైవ్..

Also Read:

PM Modi : ప్రధాని పర్యటన వేళ…హైదరాబాద్ టు నిజామబాద్ పోస్టర్ల కలకలం..!!

MLC Kasireddy: బీఆర్ఎస్ కు షాక్… ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు