PM Modi : కొండచరియలు విరిగిపడిన ఘటనపై మోదీ పోస్ట్

వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు మోదీ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేరళ సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు.

New Update
PM Modi: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?

PM Modi Post On Landslides In Kerala Incident : కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనపై మోదీ (PM Modi) స్పందించారు. వయనాడ్ జిల్లా (Wayanad District) లోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన అందిస్తామని చెప్పినట్లు తెలిపారు.

పరస్పర సహకారంతో ముందుకు సాగమని సహాయక బృందాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేరళ (Kerala) సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. ప్రభుత్వ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షించాలని అన్నారు. కొండ చరియలు విరిగిపడిన వార్త విని ఆవేదనకు గురయ్యానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.

Also Read : పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్‌…ఏడుగురు మృతి..60 మందికి

#landslides #pm-modi #wayanad-district #kerala
Advertisment
Advertisment
తాజా కథనాలు