PM Modi : ఈరోజు నుంచి ప్రధాని మోదీ మాస్కో పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మాస్కో వెళ్ళనున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలుపెట్టాక ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాలు ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. By Manogna alamuru 08 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi Russia Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) రెండు రోజుల రష్యా పర్యటన (Russia Tour) కోసం మాస్కోకు ఈరోజు వెళ్లనున్నారు. ఇది చాలా ముఖ్యమైన పర్యటన అని భారత రాయబారి వినయ్ కుమార్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలలో పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పరస్పరం చర్చించుకుంటారని, పరస్పర ఆసక్తి ఉన్న ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ (Ukraine) మీద రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ అక్కడకు వెళ్ళడం ఇదే మొదటసారి. దీంతో ఈ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ పర్యటనను రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మోదీ పర్యటన నేపథ్యంలో రష్యా విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. రష్యా-భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిలో ఉన్నాయని, క్రెమ్లిన్‌లో ఇరువురు నేతలు విడిగా చర్చించుకోవడంతో పాటు, ప్రతినిధులతో కూడిన చర్చలు రెండూ జరుగుతాయని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ (Dimitry Peskov) తెలిపారు. ఇది భారత, రష్యా సంబంధాల్లో కీలకమైన పర్యటనగా పెస్కోవ్ చెప్పారు. Also Read:NTA: ఫిర్యాదులు నిజమని తేలితే మళ్ళీ పరీక్ష-ఎన్టీయే #pm-modi #russia #dimitry-peskov మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి