PM Modi : విశ్వగురు మోదీ.. పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంతో పాటూ పైదేశాల్లో కూడా మోదీ చాలా ఫేమస్. అందుకే పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులను గెలుచుకుని మోదీ విశ్వగురు అనిపించుకున్నారు. By Manogna alamuru 15 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి National Awards : నరేంద్ర మోదీ(Narendra Modi) అంటే ఒక బ్రాండ్. భారత దేశ ప్రధానిగా పదేళ్ళుగా ఉన్న మోదీకి ఇక్కడ వారే కాదు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని గడించిన మోదీని చాలా దేశాలు తమ దేశానికి రావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానాలు పంపడమే కాక ఘనంగా సత్కరించాయి కూడా. ఈ క్రమంలోనే చాలా దేశాలు తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించాయి. Also read:రాయదుర్గం-శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు వద్దు-సీఎం రేవంత్ ఆదేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్‌తో సహా వివిధ స్థాయిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి గుర్తింపుగా వివిధ దేశాలు ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డులను అందుకున్నారు. 2014 లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు 14 దేశాల అత్యున్నత జాతీయ అవార్డు(National Awards) లను అందుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోదీ చూపించిన రాజనీతిజ్ఞత, నాయకత్వమే ఇన్ని అవార్డులను గెలుచుకునేలా చేసిందని అంటున్నారు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి మురళీధరన్. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ కు మరింత గుర్తింపు వచ్చిందని అన్నారు. మోదీకి అవార్డులు ఇచ్చిన దేశాలు 2016 లో ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు 2018 ఫిబ్రవరిలో పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ పాలస్తీనా 2018 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి నుంచి యూఎన్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు 2019 ఏప్రిల్‌లో యూఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయెద్ 2019 ఏప్రిల్‌లో రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ 2019 జూన్‌లో మాల్దీవులు నుంచి ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ 2019 ఆగస్ట్‌లో బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ 2020 డిసెంబర్‌లో సంయుక్త రాష్ట్రాలు నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్ 2021 డిసెంబర్‌లో భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ 2023 మేలో ఫిజీ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫిజీ 2023 మేలో పాపువా న్యూ గినియా నుంచి ఆర్డర్ ఆఫ్ లోగోహు 2023 జూన్‌లో ఈజిఫ్ట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది నైలు 2023 జూలైలో ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ 2023 ఆగస్ట్‌లో గ్రీస్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ #narendra-modi #prime-minister #10-years #14-awards #14-countries #national-awards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి