PM Modi: ముగిసిన ప్రధాని రష్యా పర్యటన.. ఆస్ట్రియాకు పయనం

ప్రధాని మోదీ రెండు రోజల రష్యా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అక్కడ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్ళడం 41 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి.

New Update
PM Modi: ముగిసిన ప్రధాని రష్యా పర్యటన.. ఆస్ట్రియాకు పయనం

PM Modi: ఈరోజు సాయంత్రం ప్రధాని మోదీ మాస్కో నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్ళడం 41 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి. మోదీ అక్కడ ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డర్‌ బెల్లెన్, ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో భేటీ అవనున్నారు. వారితో ప్రజాస్వామ్యం, బహుళత్వవాదం లాంటి వాటి గురించి చర్చించనున్నారు. ఈ విషయమై ఇంతకు ముందే ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’తో ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమీర్ పుతిన్.. మోదీని సత్కరించారు. 2019లో కూడా మాస్కోలో సెయింట్ కేథరీన్స్ హాల్‌లో ప్రధాని మోదీకి పుతిన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి మోదీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. రష్యా-భారత్ మధ్య స్నేహపూర్వకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మోదీ చేసిన కృషికి గానూ ఈ పురస్కారాన్ని అందించారు.

రష్యాలో ప్రధాని మోదీ రెండు రోజుల పాటూ పర్యటించారు. రష్యా అధ్యక్షడు పుతిన్‌తో మోదీ విస్తృత చర్చలు జరిపారు. వ్యాపారం, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల గురించి చర్చించారు. ఈ విషయాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇరు నేతలూ అంగీరించారు.

Also Read:Telangana: రేపటి నుంచే రైతు భరోసా అమలుకు శ్రీకారం

Advertisment
Advertisment
తాజా కథనాలు