BJP: మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా.. ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ విజయశాంతితోపాటు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది. By Karthik 01 Oct 2023 in Latest News In Telugu మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ విజయశాంతితోపాటు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది. విజయశాంతి పార్టీ అధిష్టానంపై అలిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో కొత్త వారికి పెద్ద పదవులు ఇస్తున్నారని, తనకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదని విజయశాంతి అలిగినట్లు, అందుకే ఆమె ప్రధాని మోడీ సభకు రాలేదనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు బీజేపీలో భవిష్యత్తు లేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు, దీని కోసం తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను తేల్చే పనిలో ఉన్న ఎంపీ వెంకట్ రెడ్డి.. తన తమ్ముడిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెల్లగా సమయం చూసి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని వెంకట్ రెడ్డి ప్లాన్ వేసినట్లు సమాచారం. అందుకోసమే బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ప్రధాని మోడీ సభకు వెళ్లలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు శనివారం మర్రిగూడలో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి.. తాను పార్టీ మారుతానని గత ఆరు నెలలుగా ప్రచారం జరుగుతుందన్నారు. దీనిపై తాను త్వరలోనే క్లారిటీ ఇస్తానని స్వయాన రాజగోపాల్ రెడ్డే చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ALSO READ: మానవత్వం చాటుకున్న ఎంపీ #bjp #prime-minister-modi #rajagopal-reddy #sabha #party-seniors #dumma #etc-vijayashanti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి