PM Vishwakarma Scheme: 'పీఎం విశ్వకర్మ యోజన' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ద్వారకలోని 'ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్' (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

New Update
PM Vishwakarma Scheme: 'పీఎం విశ్వకర్మ యోజన' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

PM Vishwakarma Scheme: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'పీఎం విశ్వకర' (PM Vishwakarma Yojana) పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీ(Delhi)లో ద్వారకలోని 'ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్' (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కళాకారులకు, నిపుణులకు 'పీఎం విశ్వకర్మ' సర్టిఫికెట్లను అందజేశారు ప్రధాని. ఇదే సమయంలో ‘యశోభూమి’(ఐఐసీసీ)ని కూడా జాతికి అంకిత చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. విశ్వకర్మ పథకం కుల వృత్తుల వారికి ఒక కొత్త ఆశాకిరణమని పేర్కొన్నారు.

విశ్వకర్మ జయంతిని.. భారత సాంప్రదాయ కళాకారులు, నిపుణులకు అంకితం చేయడం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వకర్మ భగవానుని ఆశీస్సులతో నేడు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించినట్లు తెలిపారు. హ్యాండ్ స్కిల్స్, టూల్స్‌తో పనిచేస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కొత్త ఆశాకిరణంగా నిలుస్తుందన్నారు.

'యశోభూమి' రూపకల్పనలో విశ్వకర్మల నైపుణ్యం..

ద్వారకలో నిర్మించిన 'యశోభూమి'ని దేశానికి అంకితం చేస్తూ.. నేడు దేశంలో అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం-యశోభూమి కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు ప్రధాని. ఇక్కడ చేసిన పని విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల దృఢత్వం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. 'యశోభూమి'లో 11 వేల మంది ఒకేసారి కూర్చునే వెసులుబాటు ఉంది. ప్రధాన హాలు, గ్రాండ్ బాల్‌రూమ్‌తో సహా ఈ 8-అంతస్తుల భవనాన్ని 73 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 15 సమావేశ గదులు ఉన్నాయి. ఇక్కడ సమావేశాలు నిర్వహించడమే కాకుండా సదస్సులు, ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు.

యశోభూమి..

Also Read:

Asia Cup 2023 final Live Score🔴: టాస్‌ ఓడిన భారత్‌.. శ్రీలంక బ్యాటింగ్‌

Siemens: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోపణలు అవాస్తవం: సీమెన్స్ ఎండీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: ఆపరేషన్ కర్రెగుట్ట.. మావోయిస్టులను చుట్టుముట్టిన భద్రతాబలగాలు.. భీకర యుద్ధం!

తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు జిల్లా కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుట్టచుట్టూ బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. 

New Update
Maoists encounter

Police Operation Karrigutta for maoist Security forces action start

Maoist: తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు జిల్లా కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుట్టచుట్టూ బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠరేపుతోంది. 

వెయ్యి మందికిపైగా సాయుధ బలగాలు..

ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ములుగు జిల్లా కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించారు. వెయ్యి మందికిపైగా సాయుధ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దీంతో ములుగు జిల్లా పరిసరప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఇదిలా ఉంటే.. సోమవారం జార్ఖండ్ లోనూ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. కీలక నేత వివేక్ కూడా హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సోమవారం ఉదయం మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.  'లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌లో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఒక INSAS రైఫిల్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసు బలగాలు, నక్సల్స్ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పారు.

Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్‌ లోడింగ్..!

telangana | telugu-news | today telugu news police 

Advertisment
Advertisment
Advertisment