mosquito tips: మొక్కల్ని ఇంట్లో పెంచితే.. దోమలన్నీ పరార్!

దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికెన్‌ గున్యా, పైలేరియా వంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి.

New Update
mosquito tips: మొక్కల్ని ఇంట్లో పెంచితే.. దోమలన్నీ పరార్!

ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వల్ల కాలం కానీ కాలంలో వానలు (Rains)  పడటం వల్ల దోమలు (Mosquitoes) విపరీతంగా పెరుగుతున్నాయి. దోమలు అనేక వ్యాధులకు (Health problems) మూలకారణాలౌతున్నాయి. దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, చికెన్‌ గున్యా, పైలేరియా వంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి.

అయితే దోమల నుంచి రక్షించుకోవడానికి చాలా మంది అనేక పద్దతులు అనుసరిస్తుంటారు. కొందరు దోమ తెరలు కట్టుకుంటే..కొందరు దోమలను తరిమి కొట్టడానికి రకరకాల మస్కిటో కాయిల్స్ ను ఉపయోగిస్తుంటారు. అలౌట్లు, రిఫిల్స్‌, జెట్‌ కాయిల్స్‌, అగరు బత్తిలు ఇలా రకరకల పద్దతులు వినియోగిస్తున్నారు.

అయితే ఇంటిలోనే కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల దోమలను తరిమి కొట్టవచ్చు అని మనం తెలుసుకుందాం.
బంతి మొక్కలు: బంతి మొక్కలు ఇంటి ఆవరణలో ఉంటే కనుక దోమలు పారిపోతాయి. దీనిలో ఉండే పైరేత్రం అనే పదార్థం కీటక నివారిణిగా పని చేస్తుంది. బంతి మొక్కలు కుండీల్లో, నేల మీద కూడా పెంచుకోవచ్చు.

సిట్రనెల్లా: ఘాటైన వాసన కలిగిన ఈ మొక్క దోమల నివారిణిగా చెప్పుకోవచ్చు. ఈ మొక్క ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవచ్చు.

లెమన్ బామ్‌: పుదీనా కుటుంబానికి చెందిన లెమన్‌ బామ్‌ మొక్క హార్స్‌ మింట్‌ గా ఈ మొక్కను పిలుస్తారు. దీని సువాసనకు దోమలను తరిమికొట్టే శక్తి ఉందని తెలుస్తుంది. ఆకులను ఎండబెట్టి టీ పొడిగా చేసుకుని తాగవచ్చు కూడా. ఈ చెట్టును ఇంటి పెరట్లో పెంచుకోవటం వల్ల దోమలు రాకుండా తరిమికొట్టవచ్చు.

జెరానియ: ఈ మొక్కను కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు. దీనికి ఉండే నిమ్మ సువాసనకు దోమలు పారిపోతాయి. దీనిని ఇంటి ముందు కుండీల్లో లేదా విడిగా కూడా పెంచడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.

మాచిపత్రి: మాచిపత్రి దీనిని చాలా చోట్ల దవణంగా అని పిలుస్తారు. ఈ మొక్క వెదజల్లే సువాసనలకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

జామాయిల్‌, నిమ్మ నూనె కలిపి ఇంటి కిటికీలకు దోమలు ఇంట్లోకి ప్రవేశించే చోట వాటిని చల్లటం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి కషాయంలా చేయాలి. కొంచెం నిమ్మగడ్డి నూనె కలిపి ఇంట్లో స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే దోమలు దరిచేరవు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment