ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం..భారతీయ పైలట్‌తో సహా ఇద్దరు మృతి..!!

ఫిలిప్పీన్స్ లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. రెండు సీట్లున్న చిన్న సెస్నా విమానం అపయావో ప్రావిన్స్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పైలట్ భారతీయుడని ఫిలిప్పీన్స్ అధికారిక వార్త సంస్థ నివేదించింది.

New Update
ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం..భారతీయ పైలట్‌తో సహా ఇద్దరు మృతి..!!

Plane crash in Philippines: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత విమానం అదృశ్యమైంది. అనంతరం ఈ విమాన శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలిప్పీన్స్‌లో చిన్న విమానం కూలిపోవడంతో భారతీయ  పైలట్, ఫిలిప్పీన్స్ శిక్షకుడు మరణించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు సమాచారం అందించారు. రెండు సీట్లున్న సెస్నా విమానం అపయావో ప్రావిన్స్‌లో కుప్పకూలిందని, ఇద్దరు వ్యక్తులు మరణించారని ఫిలిప్పీన్స్ అధికారిక వార్తా సంస్థ నివేదించింది.

విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయ్యాక అదృశ్యం:

ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి కెప్టెన్ అడ్జెల్ జాన్ లుంబావో టబుజో, ట్రైనీ పైలట్ అన్షుమ్ రాజ్‌కుమార్ కొండే మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. లావోగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 12:16 గంటలకు ఎకో 'ఎయిర్ సెస్నా 152' విమానం టేకాఫ్ అయిన తర్వాత అదృశ్యమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. విమానం మధ్యాహ్నం 3:16 గంటలకు తూగేగారావు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది, కానీ అది అక్కడ ల్యాండ్ కావడంలో విఫలమైంది. బుధవారం మధ్యాహ్నం అపయావో ప్రావిన్స్‌లో విమాన శకలాలు లభ్యమైనట్లు తెలిపారు.

సూడాన్‌లో విమాన ప్రమాదంలో 9 మంది మృతి:

కొద్ది రోజుల క్రితం, సూడాన్‌లోని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన తర్వాత పౌర విమానం కూలిపోవడంతో నలుగురు సైనిక సిబ్బంది సహా తొమ్మిది మంది మరణించారు. ఈశాన్య ఆఫ్రికా దేశంలో సోమవారంతో 100 రోజుల యుద్దం పూర్తయిందని, వివాదాన్ని తగ్గించే అవకాశం లేదని సైన్యం తెలిపింది.

కాలిఫోర్నియాలోనూ కూలిన చిన్న విమానం :

గతంలో కాలిఫోర్నియా విమానాశ్రయం సమీపంలో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో మంటలు చెలరేగి ఆరుగురు మరణించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా ప్రకారం, లాస్ ఏంజెల్స్‌కు ఆగ్నేయంగా 130 కి.మీ దూరంలో ఉన్న మురియెటాలో ఉదయం 4.15 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ సమయంలో, విమానంలో మంటలను ఆర్పడానికి 1 గంటకు పైగా పట్టింది.

Also Read: బరిలోకి దూకుతున్న తెలుగు కుర్రాడు.. ఇవాళ్టి నుంచి విండీస్‌తో టీ20 ఫైట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America vs China Tariff War : అమెరికాకు చైనా మరో షాక్.. ఆ విమనాలు కొనొద్దని ఆదేశం

అమెరికా, చైనా మ‌ధ్య సుంకాల యుద్ధం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అమెకాకు చైనా మరో షాక్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి విమానాల‌ను ఖ‌రీదు చేయ‌వ‌ద్దు అని త‌మ ఎయిర్లైన్స్ సంస్థల‌కు చైనా ఆదేశాలిచ్చింది.

New Update
America vs China Tariff War

America vs China Tariff War

America vs China Tariff War : అమెరికా, చైనా మ‌ధ్య సుంకాల యుద్ధం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అమెకాకు చైనా మరో షాక్‌ ఇచ్చింది.అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి విమానాల‌ను ఖ‌రీదు చేయ‌వ‌ద్దు అని త‌మ ఎయిర్లైన్స్ సంస్థల‌కు చైనా ఆదేశాలిచ్చింది. రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య అగాధం ఏర్పడ‌డం వ‌ల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ వ‌స్తువుల‌పై అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. చైనా దిగుమ‌తుల‌పై సుమారు 145 శాతం సుంకాలు వ‌సూలు చేసేందుకు ట్రంప్ స‌ర్కారు నిర్ణయించింది.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!


అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగ‌న్ దేశం తీవ్రంగా ఆక్షేపించింది. అగ్రరాజ్యం చ‌ట్ట వ్యతిరేక కార్యక‌లాపాల‌కు పాల్పడుతున్నట్లు చైనా పేర్కొన్నది. దీంతో ప్రతీకారంగా అమెరికా వ‌స్తువుల‌పై 125 శాతం సుంకాన్ని వ‌సూలు చేసేందుకు నిర్ణయించింది. అమెరికా కంపెనీ నుంచి విమాన ప‌రిక‌రాలు, విడిభాగాల కొనుగోలును నిలిపివేయాల‌ని ఎయిర్‌లైన్స్ సంస్థల‌కు చైనా ఆదేశాలు జారీ చేసింది. దిగుమ‌తి వ‌స్తువుల‌పై సుంకాలు పెర‌గ‌డం వ‌ల్ల.. విమాన ప‌రికాల ధ‌ర మ‌రింత పెరిగిన‌ట్లు చైనా భావిస్తున్నది.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

అమెరికా వస్తువులపై 125 సుంకాలను విధిస్తూ ఇటీవల ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని పలు సంస్థలకు సూచించింది. ఈ నిర్ణయంతో బోయింగ్‌ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది. అదే సమయంలో ఇప్పటికే బోయింగ్‌ నుంచి విమానాలను లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకొనే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బకు బోయింగ్‌ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే ఆ సంస్థ గత కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్‌లో 20శాతం వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి. ఒక్క 2018లోనే 25శాతం బోయింగ్‌ విమానాలను బీజింగ్‌ సంస్థలు కొనుగోలు చేశాయి. కానీ, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చైనా నుంచి ఎటువంటి కొత్త ఆర్డర్లు బోయింగ్‌కు లభించలేదు.దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న  ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది.  ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతిఘటించడంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే.. చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. ప్రతిఘటించని దేశాలకు 90 రోజుల విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read :  సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం

Also Read :  రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు