Salman Khan : సల్మాన్‌ను హత్య చేసేందుకు పాక్‌ నుంచి కుట్ర.. ఏకంగా ఏకే-47తోనే....!

సల్మాన్‌ను పక్కా ప్లాన్‌తో చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర చేసినట్టు సమాచారం. దీని కోసం పాక్‌ నుంచి ఏకే-47ను తెప్పించినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా ఫార్మ్ హౌస్ లోకి దూసుకెళ్లి దాడి చేయడం వీరి ప్లాన్‌గా ఉన్నట్లు సమాచారం.

New Update
Salman Khan : సల్మాన్‌ను హత్య చేసేందుకు పాక్‌ నుంచి కుట్ర.. ఏకంగా ఏకే-47తోనే....!

Salman Khan Murder : ఇటీవలే ఏప్రిల్ 14న బాలీవుడ్ (Bollywood) నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి ముందు కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ముంబై (Mumbai) లోని బాంద్రా ప్రాంతంలో అయన నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ దగ్గర మోటారు సైకిల్‌ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తర్వాత సల్మాన్‌ ఇంటి దగ్గర కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. గతంలోనూ పలు మార్లు బిష్ణోయ్‌ గ్యాంగ్ సల్మాన్‌ ఖాన్‌ పై బెదిరింపులకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు

సల్మాన్ ను హత్య చేసేందుకు కుట్ర

అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది.  కొంతకాలంగా సల్మాన్ ను టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ ... పక్కా ప్లాన్ తో సల్మాన్ హత్యకు కుట్ర చేస్తున్నట్లు సంబంధింత వర్గాలు వెల్లడించాయి. బాంద్రాలో సల్మాన్ ఇంటి ముందు కాల్పులు ఘటనలో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు ఈ హత్య కుట్ర గురించి తెలిసినట్లు సమాచారం. పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్ అతన్ని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ తో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీని కోసం ఇతర దేశాల నుంచి ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్‌ ఆయుధాలను తెప్పించినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా ఫార్మ్ హౌస్ లోకి దౌర్జన్యంగా దూసుకెళ్లి దాడి చేసేందుకు బిష్ణోయి గ్యాంగ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

15-20 మందితో రెక్కీ

అంతే కాదు సల్మాన్ ను హతమార్చేందుకు..అతడు నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో15- 20 మంది రెక్కీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు.. ఎప్పటికప్పుడు సల్మాన్ కదలికలను బిష్ణోయి గ్యాంగ్ కు చేరవేస్తున్నట్లు తెలిసింది. ఈ రెక్కీ గ్యాంగ్ కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు.

Also Read: Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Salim Akhtar : బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత!

బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూశారు. 87 ఏళ్ల అక్తర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ,తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.  

New Update
thamanna producer

thamanna producer

బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూశారు. 87 ఏళ్ల అక్తర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్టార్ హీరోయిన్లుగా వెలుగు చూసిన రాణీ ముఖర్జీ,తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.  

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

చాంద్ సా రోషన్ చెహ్రా చిత్రంతో

1980, 1990లలో అమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తిలతో ఆయన వరుసగా సినిమాలు చేసేవారు. 'చోరోన్ కి బారాత్', 'ఖయామత్', 'లోహా', 'పార్టీషన్', 'ఫూల్ ఔర్ అంగారే', 'బాజీ', 'ఇజ్జత్' మరియు 'బాదల్' వంటి చిత్రాలకు సలీం గుర్తింపు తెచ్చుకున్నారు. రాణి ముఖర్జీ 1997లో నిర్మాత సలీం చిత్రం రాజా కీ ఆయేగీ బారాత్‌తో రంగప్రవేశం చేయగా, తమన్నా భాటియా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా చిత్రంతో బాలీవుడ్ చిత్ర  పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

సలీం అక్తర్ షామా అక్తర్‌ను వివాహం చేసుకున్నాడు.  ఏప్రిల్ 09 బుధవారం జోహార్ ప్రార్థనల తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఇర్లా మసీదు సమీపంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు