ఫోటో తీయించుకుంటే..టమాటాలు ఉచితం!

తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.

New Update
ఫోటో తీయించుకుంటే..టమాటాలు ఉచితం!

Free Tomatoes: టమాటా.. ఇది వరకు ఆ టమాటాలది ఏముందిలే అన్న వాళ్లు కాస్తా...ఇప్పుడు టమాటాలను బంగారం కంటే భద్రంగా దాచుకుంటున్నారు. చాలా మంది కొనుగోలుదారులైతే అసలు టమాటా మోహం కూడా చూడటం లేదు. టమాటాలకు ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతున్నారే తప్ప వాటి ఊసే ఎత్తడం లేదు.

సబ్సిడీ మీద టమాటాలు అందజేస్తున్నారంటే..వాటి కోసం క్యూలు కట్టి మరీ ఎంత సమయమైనప్పటికీ వాటిని తీసుకునే వెళ్తున్నారు తప్ప వదిలిపెట్టేదే లేదంటూ చెబుతున్నారు. రికార్డు స్థాయి ధరలు నమోదు చేస్తున్న టమాటా దానిని పండించిన రైతులను రాత్రికి రాత్రే కోటీశ్వరులను, లక్షాధికారులను చేస్తుంది.

ఈ క్రమంలోనే వ్యాపారం బాగా సాగాని ఇతర వ్యాపారులకు కొత్త కొత్త ఆలోచనలు కూడా ఇస్తూ వారి వ్యాపారాలు కూడా మంచిగా జరిగేటట్లు చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ కొత్తగూడెం(Kothagudem) ఫోటో గ్రాఫరే. నగరానికి చెందిన వేముల ఆనంద్ స్థానిక కలెక్టరేట్‌ సమీపంలో కొంతకాలంగా ఓ ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు.

అయితే కొంతకాలం క్రితం కలెక్టరేట్ పాల్వంచకు మారిపోయింది అప్పటి నుంచి ఫోటో స్టూడియో గిరాకీ బాగా తగ్గిపోయింది. దీంతో ఆనంద్‌ కొంతకాలం బాధపడ్డాడు. కొద్ది రోజుల క్రితం ఆనంద్ కు ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది.

ఐడియా రావడమే లేటు..దానిని అమలు చేసేశాడు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జనాలు ఎక్కువగా తిరిగే చోట పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.

తన వద్ద 100 రూపాయలు చెల్లించి పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో దిగితే వారికి 8 కాపీలతో పాటు పావు కిలో టమాటాలు ఉచితంగా అందిస్తానని ఆనంద్ పేర్కొన్నాడు.

బుధవారం ఫోటోలు తీయించుకున్న 32 మందికి ఒక్కొక్కరికీ రూ.40 విలువ గల పావు కిలో టమాటాలు అందించినట్టు ఆనంద్‌ తెలిపారు. మరోవైపు టమాటా ఆంధ్రప్రదేశ్‌లో ఆల్‌టైం రికార్డులు నమోదు చేస్తున్నది. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్‌లో కిలో రూ.224 పలికింది.

Also Read: విశాఖ కానిస్టేబుల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. పోలీసుల అదుపులో భార్య శివజ్యోతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment
Advertisment