Financial Changes: మీరు ఇవి పూర్తి చేశారా? సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!

ఆర్థిక పరంగా సెప్టెంబర్ నెలలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిలో కొన్ని నెల మొదటి రోజు నుండి అమలులోకి వస్తుండగా.. మరికొన్ని నెల చివరలో వచ్చే అవకాశం ఉంది. వీటిలో అతి ముఖ్యమైన విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.. ఇవి ప్రజల జేబులను ప్రభావితం చేయనున్నాయి. ఆధార్ అప్‌డేట్, ఆధార్ పాన్ కార్డ్ లింక్‌ చేయడం, క్రిడెక్ కార్డు బిల్లులో మార్పులు రానున్నాయి. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎక్కువ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు నిబంధనలు, షరతులకు సంబంధించి బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది.

New Update
ITR Filing: గతేడాది ఐటీ రిటర్న్స్ వేయలేదా? ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా? 

5 Financial Changes in September: ఆర్థిక పరంగా సెప్టెంబర్ నెలలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిలో కొన్ని నెల మొదటి రోజు నుండి అమలులోకి వస్తుండగా.. మరికొన్ని నెల చివరలో వచ్చే అవకాశం ఉంది. వీటిలో అతి ముఖ్యమైన విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.. ఇవి ప్రజల జేబులను ప్రభావితం చేయనున్నాయి. ఆధార్ అప్‌డేట్, ఆధార్ పాన్ కార్డ్ లింక్‌ చేయడం, క్రిడెక్ కార్డు బిల్లులో మార్పులు రానున్నాయి. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎక్కువ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు నిబంధనలు, షరతులకు సంబంధించి బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది. వార్షిక రుసుమును రూ. 10,000 (ప్లస్ GST) నుండి రూ.12,500 (ప్లస్ GST) కు సవరించింది యాక్సిస్ బ్యాంక్. అలాగే, కార్డుతో పాటు ఇస్తున్న ప్రయోజనాలను కూడా సవరించింది.

ఆధార్ కార్డ్ అప్‌డేట్(Aadhaar update)..

ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువు ఈ నెలతో ముగియనుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చివరి తేదీని జూన్ 14 నుండి సెప్టెంబర్ 14, 2023 వరకు పొడిగించింది. ఆధార్‌లోని వివరాలను గత 10 సంవత్సరాలుగా అప్‌డేట్ చేసుకోని పౌరులు.. ఈ నెల చివరిలోగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల వ్యవధిలో ఎలాంటి రుసుము లేకుండానే ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు వీలుంది. లేదంటే.. గడువు తీరిన తరువాత అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 2000 నోట్లు మార్చుకునేందుకు చివరి అవకాశం(Exchanging 2,000 notes)..

రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు ఈ నెల చివరి వరకు మాత్రమే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మేలో ప్రకటించినట్లుగా సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్దనున్న రూ. 2000 నోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేసి.. వాటి స్థానంలో వేరే నోట్లను తీసుకోవచ్చు. అయితే, ఒకేసారి రూ. 20 వేలకు మాత్రమే డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఆర్బీఐ.

ఆధార్, పాన్ తప్పనిసరి(PAN and Aadhaar card mandatory)..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (పిపిఎఫ్) వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్), ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు సెప్టెంబర్ 30లోగా ఆధార్ కార్డ్, పాన్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే సదరు వ్యక్తుల ఖాతాలు స్తంభించిపోతాయి.

నామినేషన్ (Nomination)..

మరో కీలకమైన గడువు ఏంటంటే.. ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల కోసం నామినేషన్ సౌకర్యం కల్పించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI). ఈ ఏడాది మార్చిలో, థీసిస్ హోల్డర్లు నామినేషన్లు చేయడానికి, వైదొలగడానికి సమయాన్ని పొడిగించింది. ఈ నెల అంటే సెప్టెంబర్ 30 వరకు ఇందుకోసం గడువునిచ్చింది.

ఐఫోన్ 15 లాంచ్ డేట్ ఫిక్స్.. వివరాలివే..

Also Read: Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులు.. లిస్ట్ చూసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు