Telangana Politics: సీఎంగా కేసీఆర్‌నే ఆశీర్వదిస్తారు: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హనుమకొండ జిల్లాలో నడికూడా మండలాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్‌ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికూడ మండలంలో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని మరియు బస్ స్టేషన్‌ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.

New Update
Telangana Politics: సీఎంగా కేసీఆర్‌నే ఆశీర్వదిస్తారు: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హనుమకొండ జిల్లాలో నడికూడా మండలాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్‌ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికూడ మండలంలో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని మరియు బస్ స్టేషన్‌ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌ పథకాల్ని పెంచి ఇస్తామని అర్రాసు పాట హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని పార్టీ.. తెలంగాణ ఎలా ఇస్తుందని ధర్మారెడ్డి  ప్రశ్నించారు. రైతులను అరిగోస పెట్టిన కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతామన్నారు.

ప్రజలంతా మద్దతుగా నిలవాలి

అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబీమా, రైతుబంధు 24 గంటల ఉచిత విద్యుత్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల రైతులకు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. అనంతరం బీసీ బంధు కింద రూ. లక్ష చెక్కులను, దళిత బంధు, మైనారిటీలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బీఆర్‌ఎస్‌ గెలుపుతోనే రాష్ట్రానికి రక్షణ ఉంటుందన్నారు. మంచి చేసిన కేసీఆర్‌కు ప్రజలంతా మద్దతుగా నిలవాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ నాయకులకు దమ్ము ఉంటే

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి పేదవాడికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు దమ్ము ఉంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దివ్యాంగులకు వృద్ధులకు, కల్యాణలక్ష్మి, పింఛన్‌, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌ ఇవ్వాలని సవాల్‌ చేశారు. యావత్‌ దేశ ప్రజలు సీఎం కేసీఆర్‌ను కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతుబందు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు