AP Politics: ఏపీ నీడ్స్ జగన్ నినాదం జనాన్‌లో బెడిసికొట్టింది, "ఏపీ క్విట్ జగన్ " నినాదం ఊపందుకుంది

వైనాట్ 175 అన్న జగన్ నినాదం తారుమారై... టీడీపీ విషయంలో నిజం కానుంది. జగన్‌రెడ్డిని ఇంటికి పంపి.. చంద్రబాబుని గెలిపించాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ వ్యాఖ్యనించారు.

New Update
AP Politics: ఏపీ నీడ్స్ జగన్ నినాదం జనాన్‌లో బెడిసికొట్టింది, "ఏపీ క్విట్ జగన్ " నినాదం ఊపందుకుంది

కావలి నియోజకవర్గం, అల్లూరు మండలంలోని పోలేరమ్మ దేవస్థానం దగ్గర నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించి ఆయన అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీపై నిరాధార ఆరోపణలు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అణచివేత ధోరణితో జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజా సమస్యలతో సహా రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య లేవనెత్తినా, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినా..? అక్రమ అరెస్టులకు పాల్పడటం జగన్ రెడ్డికి, పోలీస్ వ్యవస్థకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి, చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి దాదాపు 3 వారాలు దాటింది. ఇంతవరకు ఒక్క ఆధారం బయట పెట్టలేకపోయారని మండిపడ్డారు.

ఉద్యోగాలు ఇప్పిస్తే జగన్‌కి నచ్చదు

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా 42 శిక్షణా కేంద్రాలు తెరిచి ఆంధ్రప్రదేశ్ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించిన గొప్ప ప్రాజెక్ట్‌ను జగన్‌ తన విద్వేషానికి బలిచేశారని ఆరోపించారు. రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం, ఉపాధి, ఉద్యోగాలు సృష్టించడం చంద్రబాబు చేసిన నేరంగా జగన్ మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. యువత అంటే చేపలు.. మాంసం అమ్ముకోవడమో, గొడ్డుచాకిరీ చేయాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని సూచించారు. అలా కాదని నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చినా.. లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తే జగన్‌కి నచ్చదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.280 కోట్లు ఖర్చుపెట్టి, ప్రతి ఇంటికీ కేవలం రూ.149 లకే టీవీ, ఇంటర్‌నెట్, టెలిఫోన్ సౌకర్యం అందించిన గొప్ప ప్రాజెక్ట్ "ఫైబర్ నెట్" పై కూడా వైసీపీ నేతలు బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్కువ ధరకు అందించడమే చేసిన నేరమా..?

పోర్చుగీస్ ప్రభుత్వ సంస్థ, అమెరికాకు చెందిన సిస్కో కంపెనీలు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌కు అవసరమైన అన్నిరకాల సామాగ్రి అందించారు. రాష్ట్రమంతా 24 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయబడింది. ఇంత స్పష్టంగా ప్రాజెక్ట్ ఫలితాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే.. అవినీతికి ఆస్కారం ఎక్కడుంది..? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను ఏపీ రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాలతో కూడిన10 లక్షల కనెక్షన్‌లను చంద్రబాబు నాయుడు అందించారు. పేదలకు ఇంటర్నెట్.. టీవీ.. టెలిఫోన్ కనెక్షన్‌ను తక్కువ ధరకు అందించడమే చంద్రబాబు చేసిన నేరమా..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేసిన ఈ ప్రాజెక్ట్ కోసం జగన్ రెడ్డి వచ్చాక రూపాయి ఖర్చు పెట్టింది లేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రూ.280 కోట్లతో అమలు చేసిన ప్రాజెక్ట్ ద్వారా ఏటా రూ.150 కోట్లు దండుకుంటున్నాడని ఆరోపించారు. చంద్రబాబు రూ.149 లకే అందించిన సౌకర్యాలను.. జగన్‌రెడ్డి తన దోపిడీ కోసం రూ.349 లకు పెంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  భార్యా పిల్లలను చంపేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు