Lay Offs 2024: 2500మంది ఉద్యోగాలకు కోతపెట్టనున్న పేపాల్ టెక్ కంపెనీలు అన్నీ వరుసపెట్టి లేఆఫ్స్ చేస్తున్నాయి. గతేడాది మొదలుపెట్టిన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి రెడీ అయ్యాయి. By Manogna alamuru 31 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PayPal Layoffs: పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ తమ ఉద్యోగులకు టాటా, బైబై చెబుతున్నాయి. ఇప్పటికే వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలు కూడా లేఆఫ్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఇది ఆందోళనకర స్థాయిలో ఉంది. తాజాగా మరో రెండు కంపెనీలుకూడా ఇదే బాట పడుతున్నాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ అయిన పేపాల్ (PayPal) ఉద్యోగాల కోతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో మొత్తం 9శాతం మందిని లేదా 2500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిన్న కంపెనీ సీఈవో అలెక్స్ క్రిస్ (Alex Chriss) లేఖ కూడా రాశారు. మరికొద్ది రోజుల్లోనే ఇవి ఉంటాయని చెప్పారు. Also Read:H-1B Visa:మార్చి 6 నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు..ఆన్‌లైన్ ఫైలింగ్ మీద కీలక అప్‌డేట్ భారీగా పడిపోయిన పేపాల్ షేర్లు... కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరుల్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం కోసమే లేఆఫ్స్ ప్రక్రియ చేపట్టామని పేపాల్ సీఈవో చెబుతున్నారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విభాగాల్లో మాత్రం పెట్టుబడులను కొనసాగిస్తామని తెలిపారు. ఇక దాంతో పాటూ పేపాల్ కృత్రిమ మేధ అయిన ఏఐ (AI) మీద కూడా ఒక ప్రకటన చేసింది. భవిష్యత్తులో తమ కంపెనీలో కూడా ఏఐ వినియోగం పెంచుతామని చెప్పింది. కొద్దికాంలగా పేపాల్ షేర్లు భారీగా పడిపోయాయి. ఏఐ వినియోగంతో షేరు (PayPal Shares) ధర 20శాతం మెరుగుపరుస్తుందని ఇన్వెస్టర్లు అంటున్నారు. యునైటెడ్ పార్శిల్ సర్వీసెస్... మరోవైపు యునైటెడ్ పార్శిల్ సర్వీసెస్ కూడా తమ కంపెనీ నుంచి 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. రీసెంట్‌గా తమ ఆదాయం అంచనాలను అందుకోలేకపోయిందని అందుకే ఖర్చులని తగ్గించుకోవడం కోసం ఉద్యోగాల్లో కోత విదిస్తున్నామని తెలిపింది. అమెరికా ఇలాంటి క్లిష్ట పరిస్థుతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ 100కు పైగా కంపెనీలు 25వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. దీంట్లో అమెజాన్, గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. #tech-companies #paypal #paypal-layoffs #layoffs-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి