/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Babybro-jpg.webp)
Pawan Kalyans Bro and Baby Movies OTT Release: ఆగస్ట్ నెలాఖరులో థియేటర్లను మించిన వినోదం ఓటీటీలోకి వస్తోంది. పవన్ కల్యాణ్ (Pawan kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన బ్రో సినిమా, అటు సూపర్ హిట్ బేబి సినిమా ఓటీటీలోకి వస్తున్నాయి.
బేబీ సందడి
జూలై 14న థియేటర్లలోకొచ్చింది బేబి సినిమా. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. విరాజ్ అశ్విన్ సెకెండ్ హీరోగా నటించాడు. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్టయింది. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా 95 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఆహా యాప్ (Aha APP) లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ముందుగా ఈ సినిమాను గోల్డ్ సబ్ స్క్రైబర్ల కోసం స్ట్రీమింగ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. శక్రవారం నుంచి మిగతా సబ్ స్క్రైబర్లు అందరికీ ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.
నెట్ ఫ్లిక్స్ లో బ్రో-ది అవతార్
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో-ది అవతార్ జూలై 28 న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా కూడా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా రైట్స్ ను 38 కోట్ల రూపాయలకు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ (Netflix) సంస్థ, రేపట్నుంచి స్ట్రీమింగ్ కు పెడుతోంది. గురువారం అర్థరాత్రి నుంచే ఈ సినిమా అందుబాటులోకి వస్తోంది.
బ్రో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి యావరేజ్ టాక్ వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి ఈ సినిమా సరిపోదని చాలా మంది భావించారు. మరోవైపు సాయితేజ్ సీన్ లో ఉన్నప్పటికీ బ్రో మూవీ ఆకట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్ స్వయంగా ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే అందించాడు. సముద్రఖని దర్శకత్వం వహించాడు.
థియేటర్లలో బేబి సినిమా హిట్టవ్వగా, బ్రో సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేసారి ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి. మొత్తం మీద ఆగస్టు నెలాఖరు ఓటీటీ కి మంచి వినోదాన్ని అందించనుంది.
Also Read: యూఎస్ఏలో సినిమా ప్రీ-రిలీజ్ సేల్స్ అదుర్స్
Good Bad Ugly: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్
అజిత్ కుమార్(Ajith Kumar) లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ భారీ విజయం సాధించగా, అజిత్ ఎనర్జీ, సింప్లిసిటీపై సునీల్ ప్రశంసలు కురిపించారు. ఫిట్‌నెస్‌లో, అజిత్ ధైర్యం, కట్టుదిట్టైన షూటింగ్ షెడ్యూల్ తనను ప్రభావితం చేసిందని తెలిపారు.
Good Bad Ugly
Good Bad Ugly: టాలీవుడ్ యాక్టర్ సునీల్(Sunil) తాజాగా తమిళ స్టార్ అజిత్ కుమార్‌తో(Ajith Kumar) కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు. స్టైలిష్ గెటప్‌తో తనదైన పాత్రను చూపించి మల్టీ లెవెల్ టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేస్తోంది.
Also Read: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా
ఈ సక్సెస్‌ను పురస్కరించుకొని బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న సునీల్ అజిత్ గురించి ఎంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. “అజిత్ ఎనర్జీ అసాధారణం. ఆయనలోని సింప్లిసిటీ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను” అని పేర్కొన్నారు.
Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!
9 కిలోమీటర్లు నడిచాం..
తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, “ఒకసారి అజిత్ నేను రన్నింగ్ కు వెళ్తుండగా అయ్యన కూడా వస్తానని చెప్పారు. ఉదయం 4 గంటలకు ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. దాదాపు 9 కిలోమీటర్లు నడిచాం. తర్వాత మియాపూర్‌లో షూటింగ్ ఉండడంతో గంటన్నర డ్రైవ్ చేసి అక్కడికి వెళ్లాం. ఇంటర్వెల్ ఫైట్ సీన్ 27 మంది నటులతో సింగిల్ టేక్‌లో చేసిన విధానం అద్భుతం. రీఎంట్రీ షూట్ అయినప్పటికీ, ఎటువంటి డూప్‌లేకుండా తానే చేశారు. అజిత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన నిజంగా ఒక లెజెండ్. భగవంతుడు ఆయనకు ఇంకా మంచి దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను,” అంటూ తన అనుభవాన్ని సునీల్ షేర్ చేసుకున్నారు.
Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్‌తో కలిసి త్రిష హీరోయిన్‌గా నటించగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది. సస్పెన్స్, యాక్షన్, మాస్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.
Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి అలర్ట్.. ఆ 6 ప్లాట్ ప్లాట్‌ఫామ్‌లు మూసివేత!
TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ
మూడు మూళ్లకు ఇవే బ్రహ్మ ముహూర్తాలు.. ఎల్లకాలం సుఖసంతోషాలే!
PUB CASE: హైదరాబాద్ పబ్‌ల్లో న్యూడ్ డ్యాన్స్ లు.. 17 మంది అమ్మాయిలు అరెస్టు!
Ap News: ఏపీలో 2 నెలల పాటూ చేపల వేటపై నిషేధం..