Ustaad Bhagat Singh: 'గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం'.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా 'భగత్స్ బ్లేజ్' అంటూ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో గ్లాస్ అనే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అని పవన్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. By Archana 19 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ustaad Bhagat Singh: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో.. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: Kumari Aunty: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..! ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. 'భగత్స్ బ్లేజ్' అంటూ షేర్ చేసిన ఈ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా "గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది .. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం" అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్.. గ్లిమ్ప్స్ రిలీజ్ చేయడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు. Also Read: Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలే .. మగధీర రీ రిలీజ్ డేట్ ఫిక్స్..! #ustaad-bhagat-singh #pawan-kalyan #bhagats-blaze #ustaad-bhagat-singh-teaser #ustaad-bhagat-singh-movie సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి