సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.!

జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది చంద్రబాబు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు అని అన్నారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి నడుస్తున్నట్లు తెలిపారు.

New Update
సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.!

Janasena Pawan Kalyan: విశాఖలో సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది చంద్రబాబు (Chandrababu), తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు అని అన్నారు. ఈ క్రమంలోనే జనసేన టీడీపీ వెనుక నడవడం లేదని, టీడీపీతో (TDP) కలిసి నడుస్తుందని వివరించారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి వెళ్తున్నట్టు తెలిపారు. తాను బ్రతికున్నా లేకపోయినా.. పార్టీని ఎక్కడా కలపనని వ్యాఖ్యనించారు. జనసేన (Janasena) ఒంటరిగానే ఉంటుందని..విడిపోయిన మన రాష్ట్రనికి మంచి చేస్తానంటేనే బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏపీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండని కోరారు. అధికారం కోసం తాను ఓట్లు అడగడం లేదని కేవలం మార్పు కోసం తనకు ఓట్లు కావాలని వెల్లడించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం విశాఖ నుంచే మొదలయ్యిందని అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేలని..కానీ, ఇక్కడి వారు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుని ప్రైవేటికరణ చేస్తే..మా బావోద్వేగాలు రగిలిపోతాయన్నారు. ఈ తరాన్ని కాపాడుకుంటూ..రాబోయే తరం కోసం తాను ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలని కోరారు. తాను ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలే కృషి చేస్తాని హామీ ఇచ్చారు.

Also Read: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే!

కేవలం సినిమాలు మాత్రమే చేస్తే తనది స్వార్థమైన జీవితం అవుతుందన్నారు. డబ్బులు లేకున్నా పార్టీని ఒంటిచేత్తో నడుపుతున్నానంటే మీ ప్రేమభిమానాలే కారణం అని కామెంట్స్ చేశారు. సినిమాల్లో నన్ను ఆదరించడంతో మీకోసం పనిచేయాలని వచ్చానని అన్నారు. మీకు కష్టం వస్తే జనసేన నిలబడుతుందని భరోసా కల్పించారు. ప్రజల భవిష్యత్తు కోసమే తాను నానా తిట్లు తింటున్నానన్నారు. తాను సినిమాల్లో ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదని..ఓటమి ఎదురోచ్చినా పోరాడుతూనే ఉన్నానని తెలిపారు పవన్ (Pawan Kalyan).

"ఏపీలో రాజధానికి దారేది అంటే దారి చెప్పలేం..ఏపీకి రాజధాని (AP Capital) లేదు..ప్రతీసారి రాజధాని ఎక్కడ ఉందో ఢిల్లీ నుంచి ఎవరో ఒకరు చెప్పాలి..ఇవన్నీ మాట్లాడితే ఉత్తరాంధ్ర మీద నీకు ప్రేమ లేదా?" అంటారు. కానీ, ఉత్తరాంద్రను దోచుకుంటుంటే ఇక్కడున్న నాయకులు మాత్రం ఏమి ప్రశ్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 సీట్ల భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ కనీసం ఒక్కసారి కూడా సరైన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయిందని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..మహిళలపై దాడులు 40 శాతం పెరిగాయన్నారు. మహిళలపై దాడుల్లో ఏపీ 6వ స్థానంలో ఉందని మండిపడ్డారు. కొందరు పొగిడితే ఉప్పొంగిపోతారని.. కానీ తాను ప్రతి కష్టానికి ఉప్పొంగిపోతానని అన్నారు. ఎన్ని ఓటములు ఎదురైనా తాను ఎట్టి పరిస్థితిల్లో వెనుకడుగు వెయ్యనని..ప్రజల కోసం పోరాడుతునే ఉంటానని తేల్చి చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు