BIG BREAKING: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు.. పాలసీ విభేదాలతోనే బయటకు వచ్చానని పవన్ తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. By BalaMurali Krishna 14 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి TDP - Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. రేపటి నుంచి టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్, హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి జైలు వద్ద పవన్ కల్యాణ్ ప్రసంగం.. ☛ చంద్రబాబుతో ముగిసిన బాలయ్య, పవన్ ములాఖత్ ☛ దాదాపు 40 నిమిషాలు సేపు చంద్రబాబుతో మీటింగ్ ☛ నాలుగున్నరేళ్లుగా ఏపీలో అరాచక పాలన నడుస్తోంది ☛ చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు ☛ చంద్రబాబును రిమాండ్‌లో జైలుకు పంపడం బాధాకరం ☛ నా సానుభూతి ప్రకటించేందుకు ఇక్కడికి వచ్చా Also Read: జైల్‌కి వెళ్ళింది అందుకే..జనసేనానిపై వైసీపీ విమర్శనాస్త్రాలు..!! ☛ మోదీ లాంటి నాయకుడు దేశానికి అవసరం కాబట్టే ఆయనకు 2014లో మద్దతు ఇచ్చాను ☛ చంద్రబాబుతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు.. పాలసీ విభేదాలతోనే బయటకు వచ్చా ☛ ఆయన అనుభవాన్ని ఏరోజు నేను ప్రశ్నించలేదు ☛ బాబు నాయకత్వంతోనే హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ అంత అభివృద్ధి చెందింది ☛ అలాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరం ☛ లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న సైబరాబాద్‌ను సిటీ నిర్మించిన వ్యక్తి చంద్రబాబు ☛ కేవలం రూ.371కోట్ల కేసులో చంద్రబాబును ఇరికించడం హాస్యాస్పదం ☛ క్రిమినల్ కేసులు ఉన్న జగన్ చంద్రబాబుపై కేసు మోపడం విడ్డూరం ☛ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి జగన్ ☛ అవినీతి బూరదలో కూరుకుపోయిన వ్యక్తి.. అందరికి బురద అంటిస్తున్నాడు ☛ సొంత రాష్ట్రానికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు ☛ పోలీసులకు కూడా చెబుతున్నాను మీరు కూడా చట్టప్రకారం నడుచుకోవాలి ☛ సొంత బాబాయ్ వివేకా హత్య కేసులో ఒక్కరు కూడా జైలుకు వెళ్లలేదు ☛ అక్రమంగా భూ కబ్జాలు చేస్తున్నా వ్యక్తులపై కేసులు పెట్టడం లేదు ☛ గుజరాత్ పోర్టులో రూ.3వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటే.. దాని మూలాలు విజయవాడలో ఉన్నాయి ☛ ఇంతవరకు పోలీసులు ఆ కేసును పట్టించుకోవడం లేదు ☛ చంద్రబాబు అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నాను ☛ జైలులో చంద్రబాబుతో ములాఖత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన ఒరవడి కాబోతుంది ☛ వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా.. ఏ ఒక్కరిని వదలం ☛ సొంత చెల్లి, బావ, అమ్మను వదిలేసిన వ్యక్తి జగన్ ☛ సొంత బాబాయ్ ని చంపిన వ్యక్తికి ఉన్నతాధికారులు మద్దతు పలికి సమస్యలు కొనితెచ్చుకోవద్దు ☛ జగన్‌ను నమ్ముకున్న వైసీపీ నాయకులు, ఉన్నతాధికారులకు చెబుతున్నాను.. ఏ ఒక్కరినీ వదలం ☛ పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరు ☛ మీకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది ☛ మీకు యుద్ధమే కావాలంటే యుద్ధానికి సిద్ధం ☛ రేపు అధికారంలోకి వచ్చాక అందరి తాట తీస్తాం ☛ ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, భూకబ్జాలు చేస్తున్న నాయకులను జైలులో కూర్చోపెడతాం ☛ ఎన్‌సీజీ భద్రత ఉన్న చంద్రబాబుకు జైలులో మరింత భద్రతపై కల్పించాలి ☛ ఆయన భద్రతపై ఆందోళనగా ఉంది ☛ చంద్రబాబు అరెస్ట్ వెనక కేంద్ర పెద్దల హస్తం ఉంది అని అనుకోవడం లేదు Also Read: యుద్ధానికి రెడీ.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్న టీడీపీ-జనసేన #pawan-kalyan #tdp #chandrababu #jana-sena #ap-elections #janasena-chief-pawan-kalyan #tdp-janasena-alliance #tdp-and-janasena-contest-togethe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి