Cake Kills: 10ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన బర్త్‌డే కేక్‌.. విషం కలిపారా?

బర్త్‌డే కేక్‌ తీని 10ఏళ్ల మాన్వి చనిపోయింది. పంజాబ్‌ పాటియాలాలో ఈ ఘటన జరిగింది. ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్‌ను ఆర్డర్‌ చేసింది మాన్వి కుటుంబం. ఆ కేక్‌ తిన్నవారంతా అస్వస్థకు గురయ్యారు. మాన్వి పరిస్థితి వెంటనే విషమించి మృతి చెందింది.

New Update
Cake Kills: 10ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన బర్త్‌డే కేక్‌.. విషం కలిపారా?

పుట్టిన రోజు నాడే ప్రాణాలు విడిచిందో చిన్నారి. పంజాబ్‌ పాటియాలాలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఓ బేకరీ నుంచి ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్‌ ఆర్డర్ చేశారు. ఆ కేక్‌ను తిని మాన్వి అనే పదేళ్ల బాలిక మరణించింది. కేక్ తిన్న వెంటనే కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ముందుగా వికారం కలిగింది. తర్వాత వాంతులు అయ్యాయి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం అనుమానాస్పదంగా క్షీణించడంతో, పొరుగువారు వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. 10 ఏళ్ల బాలిక మాన్వి ఆసుపత్రికి చేరిన తర్వాత మరణించింది.

కేసు నమోదు:
బేకరీ షాపు యజమానిపై ఐపీసీ సెక్షన్ 273, 304ఏ కింద కేసు నమోదు చేసినట్లు పంజాబ్‌ మీడియా నివేదికలు ధృవీకరిస్తున్నాయి. తమ కుమార్తె మరణానికి కేక్ కారణమని పేర్కొంటూ బేకరీతో పాటు అది విక్రయించే ఉత్పత్తుల నాణ్యతపై సమగ్ర దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఇక కేకు ఫుడ్‌ పాయిజన్‌కు గురైందని తెలుస్తోంది.


గతంలోనూ ఇలాంటి ఘటనలే:
గతేడాది(2023) అక్టోబర్‌లో కేరళలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కొచ్చిలో షావర్మా తిని 24 ఏళ్ల వ్యక్తి ఫుడ్ పాయిజన్‌తో మరణించాడు. అక్టోబర్ 18, 2023న కొట్టాయం నివాసి రాహుల్ నాయర్ లే హయత్ రెస్టారెంట్ నుంచి షవర్మా భోజనాన్ని ఆర్డర్ చేశారు. అతను ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అక్టోబర్ 19న కక్కనాడ్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందిన తరువాత నాయర్ అదే రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. అక్టోబర్ 22న మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత నాయర్ పరిస్థితి విషమించి చనిపోయాడు.

Also Read: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు