Passenger Vehicle Sales: కార్ల అమ్మకాలు తగ్గాయి.. టూవీలర్ అమ్మకాలు పెరిగాయి ఈ ఏప్రిల్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తగ్గాయి. అదే సమయంలో టూవీలర్ అమ్మకాలు పెరిగాయి. ఎన్నికల కారణంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో తగ్గుదల కనిపించినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వాహనాల అమ్మకాల లెక్కలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 02 May 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి నెలలో దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(Passenger Vehicle Sales) తగ్గాయి. ఏప్రిల్‌లో 3.38 లక్షల యూనిట్ల వాహనాలు అమ్మకాలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు కూడా దెబ్బతిన్నాయి. ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు(Passanger Vehicle Sales) ఏప్రిల్‌లో 1.77 శాతం పెరిగి 3,38,341 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెలలో 3,32,468 యూనిట్లుగా ఉన్నాయి. ఈ కాలంలో మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్, టాటా మోటార్స్ దేశీయ హోల్‌సేల్ అమ్మకాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. గత సంవత్సరం పరిశ్రమ కంపేరిటివ్ బేస్ కారణంగా ఏప్రిల్‌లో ఫ్లాట్ గ్రోత్ ఏర్పడిందని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ అన్నారు. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రభావం కూడా ఉంది. ఈ ఏడాది ఎంతో ఉత్సాహంగా ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. ఎన్నికల సమయంలో మార్కెట్ కాస్త మందకొడిగా ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యాక మార్కెట్(Passenger Vehicle Sales) మళ్ళీ పుంజుకుంటుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. మారుతీ సుజుకి మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(Passenger Vehicle Sales) ఏప్రిల్‌లో 1,37,952 యూనిట్లుగా ఉన్నాయి, ఇది గత ఏడాది ఇదే నెలలో 1,37,320 యూనిట్లు. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు ఏప్రిల్‌లో ఒక శాతం పెరిగి 50,201 యూనిట్లకు చేరాయి, గత ఏడాది ఇదే నెలలో 49,701 యూనిట్లు ఉన్నాయి. ఏప్రిల్‌లో ప్యాసింజర్ వాహనాల(Passenger Vehicle Sales) వృద్ధి తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని హ్యుందాయ్ సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) తరుణ్ గార్గ్ తెలిపారు. రెండేళ్లలో అధిక కంపేరిటివ్ బేస్ ఎఫెక్ట్ ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఎంక్వైరీలు, బుకింగ్‌లు గతేడాది కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ రుతుపవనాల అంచనా దృష్ట్యా గ్రామీణ విక్రయాల(Passenger Vehicle Sales) అంచనా బాగానే ఉందని గార్గ్ చెప్పారు. Also Read: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? జాగ్రత్త అంటున్న ఆర్బీఐ ఎలక్ట్రిక్ వాహనాలు (EV) సహా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో(Passenger Vehicle Sales) టాటా మోటార్స్ రెండు శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్‌లో 47,883 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదే నెలలో 47,007 యూనిట్లుగా ఉంది. మరోవైపు, టయోటా కిర్లోస్కర్ మోటార్ హోల్‌సేల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 32 శాతం పెరిగి 20,494 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 15,510 యూనిట్లు. MG మోటార్ ఇండియా రిటైల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 1.45 శాతం తగ్గి 4,485 యూనిట్లకు పడిపోయాయి, గత ఏడాది ఏప్రిల్‌లో 4,551 యూనిట్లు ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ విక్రయాలు ఏప్రిల్‌లో 29 శాతం పెరిగి 3,01,449 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెలలో 2,32,956 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ విక్రయాలు ఏప్రిల్‌లో తొమ్మిది శాతం పెరిగి 75,038 యూనిట్లకు చేరాయి, ఇది గత ఏడాది ఇదే నెలలో 68,881 యూనిట్లు. #automobile #vehicle-sales మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి