Bengaluru: గంటకు రూ.1000 పార్కింగ్ ఫీజు..ఎక్కడో తెలుసా

పార్కింగ్ ఫీజుకు సంబంధించిన బోర్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ చర్చకు దారి తీసింది. పార్కింగ్ బోర్డు గురించి అంత మాట్లాడుకోవడానికి ఏం ఉంది అనుకుంటున్నారా..అక్కడే ఉంది అసలు మతలబు అంతా. పార్కింగ్ ఫీజు రూ.1000 అని ఉండడమే అందుకు కారణం.

New Update
Bengaluru: గంటకు రూ.1000 పార్కింగ్ ఫీజు..ఎక్కడో తెలుసా

Bengaluru Mall Charges Rs.1000 For Parking: సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒకచోట పార్కింగ్ అని ఉంటుంది...ఆప్లేస్‌లో మన కారునో, బైక్‌నో పార్క్ చేయాలి. కొన్నిచోట్ల ఇది ఫ్రీ ఉంటే...మరికొన్ని చోట్ల ప్లేస్‌ను బట్టి 10 రూ. నుంచి గరిష్టం 100దాకా ఉంటుంది. కానీ ఎక్కడైనా పార్కింగ్ ఫీ గంటకు వెయ్యి రూపాయలు ఉండడం చూశారా..ఏహే పార్కింగ్ ఫీజు అంతేమిటి..జోకులు వేస్తున్నాం అనుకుంటున్నారా...లేదండి నిజంగానే ఒకచోట పార్కింగ్ ఫీజు గంటకు అక్షరాలా వెయ్యి రూపాయాలు. బెంగళూరులో యూబీ మాల్‌లో ఇంతంత ఫీజులు వసూలు చేస్తున్నారు.

బెంగళూరు సిలికాన్ సిటీ (Silicon City) అని అందరికీ తెలిసింది. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ విపరీతంగా డెవలప్‌ అవడం వలన కాస్టాఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఇంటి అద్దెలు లాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ బెంగళూరు మరీ ఇంత కాస్ట్లీగా ఉంటుందని మాత్రం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. మరీ పార్కింగ్ ఫీజులు కూడా ఇంత భారీగా వసూలు చేస్తారని ఇప్పుడే తెలిసింది. ప్రపంచంలో ఏ ప్రముఖ నగరాల్లోనూ ఇతం ఉండదని అంటున్నారు. ఈ పార్కింగ్ ఫీజుకు సంబంధించిన ఫోటోను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారింది. దీని గురించి జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. కొందరు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతుండగా.. మరికొందరు ఫైర్ అవుతున్నారు.

సాధారణంగా పెద్ద నగరాల్లో ఉన్న షాపింగ్‌ మాల్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. వీకెండ్ అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో మాల్స్‌కు వచ్చే వారి వాహనాలతో పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోయి ఉంటుంది. కొన్ని మాల్స్‌లో పార్కింగ్ ఉచితం కాగా.. మరికొన్ని మాల్స్‌లో అయితే పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. అయితే గంటకు రూ.20, రూ.50, రూ.100 అలా వాహనాన్ని బట్టి..ఆ మాల్‌ను బట్టి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. కానీ మరీ వెయ్యి రూపాయలు అంటే దారుణమే అంటున్నారు నెటిజన్లు. యూబీ మాల్‌ (UB City Shopping Mall) ఎంత పెద్దది అయితే మాత్రం అంత వసూలు చేస్తారా అని అడుగుతున్నారు. ఇలా అయితే ఎవ్వరూ అక్కడకు రారని కామెంట్లు పెడుతున్నారు. పార్కింగ్ ఫీజే ఇంత కడితే...ఇంక మాల్‌లోకి ఏం వెళతామని అడుగుతున్నారు.

Also Read:Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు