Palla Rajeshwar Reddy: తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరుగలేదు దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరెక్కడా జరుగలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ మండల పరిధిలోని యశ్వంతపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన.. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. By Karthik 29 Sep 2023 in Latest News In Telugu వరంగల్ New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరెక్కడా జరుగలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ మండల పరిధిలోని యశ్వంతపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన.. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా లేవన్నారు. అసలు ఆ పార్టీలకు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అభివృద్ధి చేయాలనే సోయి కూడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి 2014 వరకు రాష్ట్రాన్ని పాలించింది ఈ రెండు పార్టీలే అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఈ పార్టీలు ఏనాడైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల నుంచి దోచుకొని తినడమే తప్పా వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఏనాడూ ఆలోచించలేదన్నారు. ముఖ్యమంత్రులుగా పని చేసింది ఆంధ్రాకు చెందిన వారన్న ఆయన.. అందుకే ఇన్నేళ్లు ఆంధ్రా ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నాయకులు ముఖ్యమంత్రులను తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై ప్రశ్నించలేదన్నారు. అప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రాంతం అభివృద్ధిపై గత ముఖ్యమంత్రులను ప్రశ్నించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందేనని దృడ సంకల్పంతో టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2014 తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో దూసుకు పోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణ భారత దేశానికి మార్గదర్శంగా మారిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. #brs #congress #telangana #tdp #development #palla-rajeshwar-reddy #ca-kcr #movements మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి