Telangana: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. సొంత నిధులతో భూమిపూజ

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇచ్చిన హామీని నిబెట్టుకున్నారు. తొర్రూరు మండలం గుర్తూరులో సొంత నిధులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ చేశారు.దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్లు ఆమె తెలిపారు.

New Update
Telangana: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. సొంత నిధులతో భూమిపూజ

Palakurti : పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిబెట్టుకున్నారు. ఈ మేరకు తొర్రూరు మండలం గుర్తూరులో సొంత నిధులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ చేశారు. ఈ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్లు ఆమె తెలిపారు.

ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ.. 'నియోజకవర్గంలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యేగా గెలిస్తే యువత కోసం స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నాను. చెప్పినట్లుగానే సొంత నిధులతో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుకు భూమిపూజ చేశాను. ఆటలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు స్నేహభావం పెరుగుతుంది' అని ఆమె అన్నారు.

పిల్లలను ప్రోత్సహించాలి..
ఇక స్కిల్‌ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేయడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పొగిడేస్తున్నారు. అలాగే ఈ భూమిపూజ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన స్థానిక యువత తరలివచ్చారు. దీంతోపాటు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో నిర్వహించిన క్రికెట్‌‌ పోటీలను ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు, ఆటల్లోనూ ప్రోత్సహించాలని సూచించారు.

ఇది కూడా చదవండి : Maldives: మాల్దీవుల లొల్లి.. వాళ్లను తిట్టిపోస్తున్న సినీ స్టార్స్

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి..
ఈ క్రమంలోనే టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మహబూబాబాద్‌‌ జిల్లా తొర్రూరులో టీపీటీఎఫ్‌‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జోనల్‌‌ స్థాయి విద్యా సదస్సులో పాల్గొన్న ఆమె.. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను ప్రభుత్వానికి వివరించి పరిష్కరిస్తానని మాటిచ్చారు. సోమారపు ఐలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ హైకోర్టు మాజీ జడ్జి చంద్రకుమార్, నర్సింహారెడ్డి, ఝాన్సీ రాజేందర్‌‌రెడ్డి, మున్సిపల్‌‌ చైర్మన్‌‌ రామచంద్రయ్య, మహంకాళి బుచ్చయ్య, కవిత, శ్రీశైలం, విష్ణువర్ధన్‌‌రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు