Narendra Modi: మాకూ మోదీ లాంటి నాయకుడు కావాలి అంటున్న పాకిస్తాన్ వ్యాపావేత్త 

పాకిస్థాన్‌కు చెందిన అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరర్ ధానీ ప్రధాని మోదీ.. భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడారు. పాక్ కు కూడా ప్రధాని మోదీ లాంటి నాయకుడు కావాలి. పాకిస్థాన్‌లో అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కాబట్టి మోదీ లాంటి పరిపాలన మనకు అవసరమని ఆయన అన్నారు. 

New Update
PM Modi : 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ డేట్ తో ప్రధానికి ఉన్న సెంటిమెంట్ ఇదే!

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పై గతంలో పాకిస్థాన్ పార్లమెంట్‌లో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ కు చెందిన పాక్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త సాజిద్‌ తరార్‌ మోదీ లాంటి నాయకుడు తమకూ కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మోదీ ఇప్పుడు భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన బలమైన నాయకుడని, మూడోసారి దేశానికి ప్రధాని అవబోతున్నారనీ ఆయన అన్నారు. మోదీ భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా మంచివాడు, పాకిస్తాన్‌కు అతనిలాంటి నాయకుడు ఉండాలని బాల్టిమోర్‌కు చెందిన పాకిస్థానీ-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరర్ ధానీ అభిప్రాయపడ్డారు. 

మోదీ(Narendra Modi) అద్భుతమైన నాయకుడు. ఆయన సహజమైన నాయకుడు. పాకిస్థాన్ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. రాజకీయ అయోమయాలన్నీ వదిలి మన దేశంతో చర్చలు ప్రారంభించి వ్యాపారం చేస్తారని భావిస్తున్నామని సాజిద్ తరార్ అన్నారు. భారత్‌కు శాంతియుత పాకిస్థాన్‌ అవసరమన్నారు.

సాజిద్ తరార్ 1990లలో అమెరికాకు వెళ్లి అక్కడ పాకిస్థానీ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. భారతదేశంలో 97 కోట్ల మంది ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడం ఒక అద్భుతం తప్ప మరొకటి కాదని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని తరార్  అన్నారు.

“మోదీ(Narendra Modi) పాపులారిటీని చాలా సందర్భాల్లో చూశాను. భారతదేశం ఇప్పటికే అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుంది” అని ఆయన చెప్పారు. 

Also Read: పాకిస్తాన్ లోని ప్రభుత్వ సంస్థలనీ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిన పాక్ ప్రధాని.!

Narendra Modi: సాజిద్ తరార్‌ను పాకిస్తాన్ గురించి అడిగినప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ధరల పెరుగుదల  సామాజిక అశాంతికి దారితీసింది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. పెట్రోల్ ధర పెరిగింది. పన్నులు పెంచాలని IMF కోరుతోంది. విద్యుత్తు ఖర్చు పెరిగింది. ఎగుమతి చేయలేకపోతున్నామని ఆయన అన్నారు.

Narendra Modi: పీఓకే ప్రజలకు ఆర్థిక సాయం అందించాలన్న పాకిస్థాన్ ప్రధాని నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దురదృష్టవశాత్తూ అట్టడుగు సమస్యల పరిష్కారానికి పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఎగుమతులను ఎలా పెంచాలి. ఉగ్రవాదాన్ని నియంత్రించడం, శాంతిభద్రతలను ఎలా మెరుగుపరచాలి వంటి అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని చెప్పారు.  ప్రస్తుతం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో అశాంతి, రాజకీయ అస్థిరత ఉంది. ఇన్ని సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మంచి నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు